పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొకచేతితోను నిమురుచు) బిడ్డలారా! మీరు దీర్ఘాయుష్మతులయి సుఖపడండి.

రాము - (గౌరిచేయిపట్టుకొని ముందుకువచ్చి) అయ్యా! మీరు మమ్మలిని కూడా వక్కమాటు ఆశీర్వదించండి. యిదే నాకు మీఆఖరు దీవెన. ఇదివరదాకా స్వతంత్రంగా వుండేవాణ్ని. ఇప్పుడు యీగౌరమ్మ చేతులో పడ్డాను. యిది యికనన్ను నగలు తెమ్మని చంపుతుందో బ్రతికిస్తుందో దేవుడికి తెలియవలెను. మీకు నాచావు తప్పించవలెనని వున్నట్టయితే రెండువందలరూపాయలు ఇవ్వండి. నగలు చేయంచుకుం టాము. మీపాత తాటకుల పుస్తకాలు వకకావిడి నాకు దయచేసి నారంటే యీ శీతాకాలము చలిమంటవేసుకుని మీరు పెళ్ళిచేయించి నందుకు మీపేరుచెప్పుకుని సుఖపడుతాము. అప్పటితో నాకునిత్యమూ పురుగులు దులపవలసిన బాధకూడా విరగడై పోతుంది.

మతి - ఓరిమోటపశువా! పవిత్రమైన పుస్తకాలవిషయమై అటువంటి మాటలంటే పాపంవస్తుంది. వూరుకో.

సుమ - రామా! బాబయ్యగారి మనసునొచ్చే మాటలనకు మావివాహం అయిన తరువాత మిమ్మలిని ఇద్దరినీ మాదగ్గిర వుంచు కుని నీపెళ్ళాము నిన్ను మింగివెయ్యకుండా కాపాడుతాములే.

సుబ - మామగారూ! మీరునన్ను నిష్కారణంగా పిచ్చవాణ్ని చేసినారు. అందుచేత నేను మిమ్మలిని మళ్ళీపిచ్చవాణ్ని చేసినాను. వం తుకువంతు సరిపోయింది. క్షమించి ఇఖమీరు చెయ్యవలసినపని శీఘ్రం గాచేయించండి.

మతి - రండి లోపలికి వెళుదాము. రామా! నీవు బంధువులకంద రికీ శుభలేఖలు తీసికొని వెళ్ళవలెను. రేపు ప్రయాణానికి సిగ్ధంగావుండు.

(అందఱును నిష్క్రమించుచున్నారు.)