పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతి - (మరింత గట్టిగా గింజుకొనుచు) సందేహంలేదు. వీళ్ళు యిప్పుడునన్ను చంపివేస్తారు. వక్కసారి నేను వీళ్లను యోగదృష్టితో చూచి స్తంభీంపజేస్తినా-

[సుబలుఁడును రాముఁడును మతిమంతుని తలగొఱుగుటకు సిద్ధ పడుచుండఁగా సదానందయోగియు గజాననదాసును ప్రవేశించుచున్నారు.]

సదా - (గజాననదాసుతో) ఇది మరీవింతగావున్నది.

సుబ — (వెనుకతిరిగి వారినిచూచి) ఇరుగో యీయన పిచ్చ స్నేహితులుకూడా వచ్చినారు. రామా! వక్కనిముషం ఆగు.

రాము — ఈలోగా నీళ్ళతో తలతడుపుతూవుంటాను.

సుబ — వద్దువద్దు. (అని మతిమంతుని వెనుకవైపుననున్న సదా నందయోగి గజాననదాసులవద్దకు వెళ్ళుచున్నాఁడు.)

రాము — మంచిది. (అని వెనుకతిరిగి చూడకుండ మతిమంతుని కుర్చీలో నదిమి పట్టుచున్నాఁడు.)

సుబ - (ఆవైదులచేతులు పట్టుకొని) మీరు మంచిసమయంలో వచ్చినారు. మీరాక నాకు బహుసంతోషంగావున్న ది.

సదా -- నాకూ సంతోషంగానేవున్నది.

గజా - నాకూనూ.

సుబ — మీరు యిటువంటి ఘనవైద్యులన్నమాట నాకు మొట్ట మొదట తెలియలేదు. మీరు యిద్దరూ ధన్వంతరియొక్క అపరావ తారాలు.

సదా - ఈచిన్నవాడు చాలాబుద్ధిమంతుడులాగు కనపపడుతూ వున్నాడు.

గజా - అయ్యా! మీరు మహాసరస్తులు.