పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[సుమతి ప్రవేశించుచున్న ది.]

సుమ — అయ్యో-

మతి - (వికారముగా కాళ్ళును చేతులును గింజుకొనుచు) అమ్మాయీ! సుమతీ! రా. వేగిరంరా. నాకట్లువిడిపించు. పిచ్చివాణ్ని నేనుకానని యీపశువుతో చెప్పు.

సుమ — (ఏడ్చుచు) అయ్యో! గొప్పవిపత్తువచ్చింది. యామధ్య మీచేష్టలుచూచి యెప్పుడో యింతగతి పడుతుందని నేను యిదివరకే భయపడుతూవున్నాను.

రాము – అమ్మా! యెందుకు విచారిస్తావు! పిచ్చవాణ్నికట్టి వేస్తే క్షేమమేకాని యెవరికీ విపత్తులేదు.

మతి - (కన్ను లెఱ్రచేసి పండ్లుపటపట కొఱుకుచు) పరమనిర్భా గ్యురాలా? బుద్ధిలేకుండా నీవుకూడా నీతండ్రికి పిచ్చఅంటూ వున్నా వా? చూడునిన్ను - (అని ముందుకు జరగుచున్నాఁడు.)

సుమ - (పరుగెత్తి) సుబలా! నన్ను రక్షించు. ఓరీ! అబ్బీ! నీవు అయినను గట్టిగా పట్టుకుని నామీదికి రాకుండా చెయ్యలేవా?

రాము — చేస్తాను. మనయింట్లో చేంత్రాడు యెక్కడవున్నది?

మతి - (కోపముతో) ఓరిశుద్ధదున్నపోతా! నీకండకావరం–

రాము —- ఈయనను చూడండి. ఈయనపని యిలాకుదరదు. అయ్యా! సుబలా! ఈయనకు క్షవరం చేసి నిమ్మకాయల పులుసు పట్టించి నీళ్ళుపోస్తేనేకాని ఈ వుద్రేకం తగ్గదు.

సుబ - అలాచేతాము. దీనితో పిచ్చబొత్తిగా పోకపోయినా కొంచెం ఉపశాంతి కలుగుతుంది. (అని క్రిందనున్న మంగలికత్తి తీయ బోవుచున్నాఁడు.