పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంది పిచ్చవాళ్ళు బహటంగా తిరుగుతూ వుంటే పట్టుకోకుండా పోలీసు వాళ్ళు యేమిచేస్తూవున్నారు? నేనుయిప్పుడు మా ముసలి పిచ్చాయ నను తీసుకుని వెళ్ళి స్టేషనులో వప్పగించి ఆయనకూతురిని తీసుకునిలేచి పోతాను. సుమతి కూడా నేను కనపడినప్పుడల్లా యేదోవింతగా చూస్తుంది.

[సుమతి ప్రవేశించుచున్నది.]

సుమ — (కలయఁజూచి) యీపుస్తకాలన్నీ యిలాగు పారవేసి వున్న వేమి?

సుబ — సుమతీ! యీపుస్తకాలా?

సుమ - (తనలో) ఇతడే పారవేసినట్టున్నాడు. నన్నేమిచేసి పోతాడో అని నాకు భయంవేస్తూవున్నది. (అని పరుగెత్తఁబోవు చున్నది.)

[తేఱిపాఱచూచుచు మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

మతి - అమ్మాయీ! భయపడకు. అబ్బాయీ కొంచెం శాం తించు. పుస్తకాలు పాడుచెయ్యకు. (అని యాతనివంక రెప్పవాల్చక చూచుచున్నాఁడు)

సుబ - మామా! అంతాచెపుతాను వినండి. నేను మహానెమ్మ దైనవాణ్ని. నాకు సాధారణంగా కోపంరాదు. యీయింట్లో జరు గుతూ వున్న పిచ్చపనులవల్ల నావంటి శాంతుడికికూడా కోపంవస్తూ వున్నది. యిఖనైనా మీరు యీపిచ్చపనులు కట్టిపెట్టకపోతే మిమ్మ లినికూడా మెడపట్టుకుని అవతలికి గెంటివేస్తాను.