పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదా - అబ్బాయీ! మిమ్మల్ని నేనువక్కప్రశ్న అడుగుతాను గాని మరివకలాగు అనుకోక సరిఅయిన జవాబు చెప్పండి. మీ తండ్రి గారికి యెప్పుడయినా పై త్యభ్రమ వుండేదా?

సుబ - (తనలో) వీళ్ళుబుద్ధిమాలిన ప్రశ్నలువేస్తూవున్నా రు. అయినాకానీ యింకాయేమి అడుగుతారో వక్కనిముషం వోపికచేసి వింటాను. (బిగ్గరగా) లేదు.

సదా - పోనీ. మీబంధువులలో యెవరికైనా వున్నదా?

సుబ — వున్నది. మామేనమామగారికి యోగపుపిచ్చవున్నది. (తనలో) ఇఖనేనీ పాడుప్రశ్నలకు జవాబు చెప్పలేను. నిద్రవచ్చినట్టు నటిస్తాను. (అని గోడకుఁ జేరగిలబఁడి కన్నులు మూసికొను చున్నాఁడు)

సదా - (దగ్గిరకుపోయి మెల్లగా చేయిపట్టుకొని చూచి) చేతిలో పై త్యనాడి బాగా ఆడుతూవున్నది. గజాననదాసుగారూ! మీరుకూడా చూడండి.

గజా — (చేయిపట్టుకొనిచూచి) యిదిపైత్యనాడికాదు. తప్ప కుండా భూతనాడి ఆడుతూవున్నది. ఇది గ్రహలక్షణం.

సుబ — (కన్నులువిప్పిలేచి) మీరునాకు నిద్రాభంగం కలుగ చేస్తూవున్నారు. మీరు తక్షణం యీగది విడిచి వెళ్ళకపోయినట్టయితే మిమ్మలిని కొట్లోపెట్టి తాళం వేస్తాను. (అని ముందుకువచ్చుచున్నాడు)

ఇద్దఱు - (చేతులడ్డము పెట్టుకొని వెనుక వెనుకకు నడుచుచు) తాళండి వెళుతూవున్నాము. (అని గుమ్మముచేరి పరుగెత్తుచున్నారు. )

సుబ — వేగిరంవెళ్ళకపోతే యీపొస్తకాలకట్ట పుచ్చుకుని నెత్తి పగలవేస్తాను. (అని రెండుచేతులతోను రెండుతాటాకుల పుస్తకములు విసరివేయుచున్నాఁడు) దెబ్బతగలలేదు. వాళ్ళు తప్పించుకుని పారి పోయినారు. ఇఖనేను యీయింట్లోవుండకూడదు. యీవూళ్ళోయింత