పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదా - మీవూళ్ళో వింతవర్తమానాలు యేమయినావుంటే చెపుతారా?

సుబ — (తనలో) వీళ్ళువర్తమాన పత్రికలకు వ్రాసేవాళ్ళు కాబోలును. వీళ్ళకు తగినట్టుచెపుతాను. (బిగ్గరగా) మా వూళ్ళోవక లేగదూడ అయిదుకాళ్ళతో పుట్టింది. వకముసలావుకు మూడుకొ మ్ములువున్నవి.

సదా - (తనలో) దీనితో యితనికి పైత్యలక్షణముయినట్టు స్థాపనఅయినది. అయినాకానీ యింకొక్క ప్రశ్నకూడా అడిగిచూస్తాను (బిగ్గరగా) ఇవివింత సమాచారాలే. రామాయణంవిన్నారుగదా రాము డికి సీత యేమవుతుందో చెప్పగలరా?

సుబ — (తనలో) వీళ్ళునన్ను పిచ్చవాణ్నిచేసి ఆడించవలెనను కుంటూవున్నారు. వీళ్ళకు బుద్ధివచ్చేటట్టు జవాబు చెపుతాను. (బిగ్గ రగా) మీకు యీయన అయినట్టే రాముడికి సీత మేనమామమొగు డవుతుంది. తెలిసిందా?

సదా - (తనలో) ఇఖప్రశ్నలక్కరలేదు. ఇప్పుడు పిచ్చస్థిర పడ్డది.

గజా - (తనలో) ఇతణ్ని యిప్పుడు దెయ్యం సంపూర్ణంగా ఆవహించి వున్న ది. (బిగ్గరగా) అయ్యా! యోగిగారూ! మీసెలవై తే నేనుకూడా యీచిన్న వాణ్ని వకటి రెండుప్రశ్నలు అడుగుతాను. అబ్బాయీ! యిప్పుడు మీ యెదుట యెవరైనా నిలుచున్నట్టు కన పడుతూ వున్నారా?

సుబ — కనపడుతూవున్నారు. మీరుయిద్దరూ నిలుచున్నట్లు కనపడతూ వున్నారు.