పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము – అరుగో వారేవస్తూవున్నారు.

[సదానందయోగియు, గజాననదాసును ప్రవేశించుచున్నారు]

మతి - (సుబలుని కొఱకు నాలుగుదిక్కులనుజూచి) మావాడు యిప్పుడు యెలాగో వెళ్ళినాడు. సందేహంలేదు. అతను మళ్ళీ యిప్పుడే వస్తాడు. రావడంతోటే అతణ్ని మీకు చూపిస్తాను. మీరు బహు జాగ్రతగా వుండవలెను. పయికిచూడడానికి అతనంత పిచ్చవాడుగా కనపడడుగాని యీవ్యాధి మీవంటి ఘనవై ద్యులు చక్కగా శోధించ తగ్గదని తలుస్తాను.

సదా - మీరు చెప్పినదాన్ని పట్టిచూస్తే మీవాడికి పైత్య చలనమని నిశ్చయిస్తాను.

గజా – క్షమించవలెను. అది పైత్యచలనంకాదు. భూతావేశ మని నేను భావిస్తాను.

సదా - మీరు మహాబాగా కనిపెట్టినారు. (తనలో) ఇతనికి యేమీ తెలియదు.

గజా - (తనలో) యేమీ తెలియకపోయినా యితడన్నీ తనకే తెలుసునంటాడు.

మతి - మీరతణ్ని సావకాశంగా పరీక్షచేసి చూడవచ్చును. మీరు వైద్యులనిచెప్పక నాస్నేహితులని మాత్రముచెపితే అతను మీతో మనసిచ్చి మాట్లాడుతాడు. అలాచేస్తే బాగావుండదా?

సదా - దివ్యంగా వుంటుంది.

గజా - బాగానేవుంటుది.

మతి - అతని విషయంలో మీరు బహుజాగ్రతగా వుండ వలెను. వొక్కొక్కప్పుడు అతనికి పిచ్చకోపంవస్తుంది. అలాం