పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టప్పుడు అతను వళ్ళూపై తెలియకుండా దౌర్జన్యంచేస్తాడు. యిందాకా మానవుకరునూ దాసీదాన్నీ కొట్టినాడు. అయితే నేను వెంటనే వచ్చి యోగదృష్టితో చూచేటప్పటికి ఆవుద్రేకమంతాపోయి నిముషంలో శాంతపడిపోయినాడు. మీకేమైనా తొందరకలిగితే నన్ను వెంటనే పిలవండి. నేను వచ్చి యోగదృష్టితో చూచి తక్షణం శాంతుణ్ని చేస్తాను.

సదా - ఈవిషయంలో నాకు మీసహాయం అక్కరలేదు. అది మేము నిత్యమూచేసేపనే. అడుగో! ఆవచ్చేది అతనేకాబోలును.

[సుబలుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

మతి - (రహస్యముగా) అవును. అతనే (సుబలునితో బిగ్గ రగా) అబ్బాయీ! వీరిద్దరూ నాస్నేహితులు. బహుతెలిసినవారు. గొప్ప విద్వాంసులు.

సదా - (మతిమంతునితో రహస్యముగా) ఆముఖలక్షణం చూడ గానే నాకు పైత్యచలనమయినట్టు నిశ్చయంగా పొడకట్టుతూ వున్నది.

గజా – (మతిమంతునితో రహస్యముగా) అతని చూపువల్ల యిది గ్రహ లక్షణమయినట్టు నాకు స్పష్టపడిపోయింది.

మతి - (ఇద్దరితోను రహస్యముగా) మీరిద్దరూ ఆలోచించుకొని యేదోనిశ్చయం చెయ్యవలెను. యిఖమిమ్మలిని యిద్దరినీ యితనివద్ద విడిచి నేను వెళుతాను. (సుబలునితో బిగ్గరగా) అబ్బాయీ! నేను వక్కసారి లోపలికివెళ్ళి వస్తాను. ఈలోపుగా నీవు వీరియిద్దరితోనూ మాట్లాడుతూవుండు. వీరు బహుమంచివారు. (అని వెళ్ళుచున్నాఁడు.)

సుబ - (తనలో) ఈముసలివాళ్ళు యిద్దరూ నాకేసిచూచియేమో ఆలోచిస్తూవున్నారు. వీరుకూడా మామామగారి యోగపు పిచ్చలో