పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేస్తాను. ఈయన పాతతాటాకుల పుస్తకాలన్నీ పూర్ణాహుతిగా సమ ర్పిస్తారు గనుక, మీరువక్క పుస్తకమయినా మిగలకుండా కంఠపూర్తి గాభక్షించి నన్ను కృతార్ధుణ్ని చెయ్యండి.

సుబ — చెయ్యవలసినపని మనం యిద్దరమూ కొంచెంసేపటిలో నిశ్చయింతాము గాని నీవు ముందుగా యీవుత్తరం తీసుకునివెళ్ళి సుమతికియిచ్చిరా. యిదుగో రూపాయి (అనియిచ్చుచున్నాడు.)

రాము - (పుచ్చుకొని) రూపాయపుచ్చుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు గాని వుత్తరంమాత్రం నేనుతీసుకుని వెళ్ళను. వుత్తరం ఆ ఆడదానిచేత పంపించండి.

సుబ – గౌరిచేతనా? అదినన్ను చూస్తే పరుగెత్తుతుంది. నా దగ్గిరకేరాదు.

రాము — దానిచేతులో రెండణాలడబ్బులు పారవెయ్యండి. అప్పుడది కావలసినంత దగ్గిరగా వస్తుంది. దానికి కావలసిందంతే.

సుబ - అలాగయితే దాన్ని వక్కసారి యిక్కడికి పంపించు.

రాము – నిముషంలో పంపుతాను. (అనివెళ్ళుచున్నాఁడు.)

సుబ - ఒంటరిగా నేను ఆలోచించింది. బహుబాగావున్న ది. వీరందరూ కలిసి వస్తే కాస్తసేపటిలో తమాషాచేస్తాను. రాముణ్ని బెదరకొట్టకూడదు. వీడుయిందులో చాలా పనికివస్తాడు. అదుగో అప్పుడే గౌరివస్తూవున్నది.

[జెదరి బెదరిచూచుచు గౌరి ప్రవేశించుచున్నది]

గౌరి - అయ్యా! రాముడు మీరు యెందుకో నన్ను రమ్మ న్నారని చెప్పినాడు.

సుబ - అవును. యీవుత్తరం సుమతికి తీసుకుని వెళ్ళడం నిమి త్తం పిలువమన్నాను. అటువంటి సౌందర్యవంతురాలికి వుత్తరం తీసు కుని వెళ్ళడానికి నీవంటి అందగత్తెలు తప్ప యితరులు తగరు.