పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుబ — మతిభ్రమ అనా నీతాత్పర్యం?

రాము —- అవును. ఆమాట అదే.

సుబ — మొదటిమాట చిత్తచాంచల్యం కాబోలును.

రాము - నానోరు తిరగదు. మీ మామగారు నాతోచెప్పింది యిప్పుడు మీరన్న మాటే.

సుబ — (నవ్వుచు) ఇప్పుడు నాకంతా బోధపడ్డది.

రాము — అవును మీకూ బోధపడ్డది. (అనినవ్వుచున్నాఁడు)

సుబ - (నవ్వుచు) ఈవింత బహుబాగావున్నది. ఆపిచ్చ ముస లాయన నాకు పిచ్చని యెందుకనుకున్నాడు?

రాము - ఏమో! నాకు తెలియదు.

సుబ - నీకు తెలియకపోతే పొయిందిగాని నీవు నాకు నక్క సహాయం చేసిపెడుతావా?

రాము - ఏమిసహాయం? మీచేతులూకాళ్ళూ కట్టిపెట్టవలేనా యేమిటి?

సుబ - అలాగంటి పనికాదు. నాకు మామామగారి విష యంలో వక్కతమాషా చెయ్యవలెనని వున్నది.

రాము – అయ్యో! పాపం ఆయనను-

సుబ — తొందరపడకు. మరేమీలేదు వూరికే పరియాచకం అందులో నీవు సహాయంచేస్తే నీకు వకరూపాయి యిస్తాను.

రాము – అలాగైతే ఆలోచిస్తాను. ఆయన విషయంలోచేసేది యీపొస్తకాలు తగలపెట్టడంతప్ప మరేమీనాకు కనపడదు. ఈపుస్త కాలన్నిటినీ అగ్నిహోత్రుడికి సమర్పణచేస్తే నాకెంతో సంతోషంగా వుంటుంది. అలాచేస్తురూ నాశ్రమనివారణ అవుతుంది. వీటిపురుగులు కంపులేక చచ్చిపోతూవున్నాను - ఓ అగ్ని దేవుడా! నీకు నమస్కారం