పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము – అలాగా? (అని గరిటెయు గిన్నెలును తీసికొని పరు గెత్తుచున్నాఁడు.)

సుబ — వీడు నేను గరిటెలూ గిన్నెలూ యెత్తుకునిపారిపోతా ననుకున్నాడు. కాబోలును. అవన్నీ వీడు యెంతతొందరగా తీసుకుని పోయినాడో? ఇక్కడిమోస్తరుచూస్తే నాకంతా విచిత్రంగాకనపడుతూ వున్నది. దాసీది పిచ్చదిగావున్నది. ఈరాముడు తెలివిమాలిన మోట పశువులాగు కనపడుతూవున్నాడు. నామరదలుకూడా నన్నుచూస్తే పెద్దపులినో వెలుగుబంటునో చూచినట్టు భయపడుతూవున్నది. ఇఖ నామామగారిసంగతి చెప్పనక్కరలేదు. ఆయనకు పాడుపొస్తకాలు చదవగా చదవగా మతిపోయింది. మహారాణిగారిని చూచినట్టు ఆయననాకేసి వూరికే రెప్పవాల్చకుండా చూడడం మొదలుపెట్టినాడు. ఆయనకు పిచ్చఅయినందుకు ఆవగింజంతయినా సందేహంలేదు. కాని సుమతిసంగతిమాత్రం నాకేమీ బోధపడడంలేదు. యిప్పుడు సుమతికి వకవుత్తరంవ్రాసి రాముడిచేత పంపిస్తాను. (అని వ్రాయుచు చదువు చున్నాఁడు—“అత్యంతప్రియురాలవై న సుమతీ! నన్నుచూస్తే నీకంత సిగ్గూ భయమూ రావడానికి కారణంయేమిటి? నీకు నామీద కోపం రావడానికి నేను యేమినేరంచేసినాను? నేనుచేసిన అపరాధం చెప్పినట్ట యితే నేను వెంటనే నీకాళ్ళమీదపడి క్షమాపణ కోరుకుంటాను. కాబట్టి నాయందుదయవుంచి విచారగ్రస్తుడనైవున్న నన్ను సంతోష పెట్టవలెనని మరీమరీ వేడుకుంటూవున్నాను. నీచిన్ననాటి ప్రియ మిత్రుడు సుబలుడు”—ఇది చాలును.

[పోకదొన్నెయు విస్తరియు చేతబట్టుకొని రాముఁడు ప్రవేశించుచున్నాఁడు.]

రాము — ఇవిగో మీకు పెసరట్టు మళ్ళీ తెచ్చినాను. ఈసారి ఆకలితీరేటట్టుగా కావలసినన్ని తినండి. (తనలో) ఇప్పుడు గరిటెతీసివేసి