పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాగా ఆలోచిస్తే వీడితో విరోధంపడడం బాగాకనపడడంలేదు. ఇక వీడితో మంచిమాటలాడుతాను. వీడివల్లయేదైనావుపయోగంవుంటుంది (బిగ్గరగా)రామా! నేనువూరికే వేళాకోళానికి జుట్టుపట్టుకుని వూపినాను. అంతేకాని మరేమీలేదు. నీవు మహామంచివాడవుగా కనబడుతూ వున్నావు. ఇదిగో రూపాయియిస్తూవున్నాను పుచ్చుకో. (అని రూపాయిచేతిలోఁ బెట్టుచున్నాఁడు.)

రాము - (పుచ్చుకొని సంతోషములో) మీరు మహాదొడ్డ వారు. మాయజమానులవంటివారు ఫదిమందైనా మీతో సమానం కారు.

సుబ — నాకు ఆకలిగావున్న ది. తెచ్చినవి విస్తట్లోవడ్డించు.

రాము — (చిత్తము. అని రొట్టెలు విస్తరిలోవేసి నిలు చున్నాఁడు.)

సుబ —— (విస్తరిముందు కూర్చుని) ఇవేమిటియీరొట్టెలు నల్లగా వున్నవి? వీటికంటే మరియేమయినా చేసినట్టయితే బాగావుండును. (అని తినుచున్నాఁడు.)

రాము --- చెయ్యికరుచుకుంటారు. జాగ్రతగాతినండి.

సుబ — చెయ్యి కరుచుకోవడానికి నేను పసిపిల్లవాణ్ని అను కున్నావాయేమిటి? రామా! యివి బాగున్నవికావు. తినడానికి వీటి కంటె యేమయినా మంచివితెస్తూ.

రాము — మరేమి తేవడానికి వల్లకాదు. అయ్యగారు యివి మాత్రమే మీకు పెట్టమన్నారు. యివన్నీ పైత్యహారపు వస్తువులట.

సుబ - అయ్యగారిని - (ఆపుకొని) పైత్యహారమూ లేదు. యేమీ లేదు. మరియేమయినా తీసుకొనివస్తూ. నాకు వీటితో ఆకలి యెంత మాత్రమూ తీరలేదు.