పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుబ - భాగాజ్ఞాపకంవున్నది. అతను మనల్ని తరుముకువచ్చే టప్పటికి మనంలేళ్ళలాగు పరుగెత్తుకువచ్చి వీధిలో పడ్డాము. అతడు మననుపట్టుకోవలెనని వెనుక పరుగెత్తుకొనివచ్చి పరుగెత్తలేక కాలు జారి బొండులాగు బురదకాలువలోపడ్డాడు. బట్టలన్నీ బురదయి పోయి నవి. ఆ సంగతి చెప్పుకుని మనం నెల్లాళ్ళదాకా రోజూ కడుపు లుబ్బే టట్టుగా నవ్వుకుంటూవుండేవాళ్ళము. ఆచిన్ననాటి ఖులాసాదినాలు మళ్ళీరావు.

సుమ — అటువంటి దినాలు మళ్ళీరావు. అప్పుడు నీవు పిచ్చ - (జ్ఞప్తికితెచ్చుకొని) కాదుకాదు. నాఅభిప్రాయం అదికాదు. యేమీ లేదు. (అని తొందరపడుచున్నది.)

సుబ — సుమతీ! అలా భయపడుతావేమి? తొందరపడబోకు. నాదగ్గిర నీకు భయంయెందుకు?

సుమ - (లేచి మెల్లగా లోపలికి నడుచుచు) మానాన్నగారు-

సుబ — మీనాన్నగారు యేమిటి? ఆయనచూస్తే యేమి చేస్తాడు? తలకొట్టివేస్తాడా యేమిటి? వచ్చికూర్చో. (అని చేయి గట్టిగా పట్టుకొని లాగుచున్నాఁడు.)

సుమ - (తనలో) ఇతనికి పిచ్చ యెక్కువవుతూవున్నది. (బిగ్గ రగా) అవును. మీరుచెప్పిందంతా నిజం. ఆయన మనను యేమి చెయ్యలేడు. వచ్చి కూర్చుంటాను. నాచెయ్యి వదలండి.

సుబ — ఇదిగో వదలినాను.

సుమ — మీకు వంటయిందేమో కనుక్కొనివస్తాను. (అని చటుక్కున లోపలికిపోయి తలుపువేసికొనుచున్న ది.)

సుబ - ఇదియేమిటి? (అని అద్భుతపడి నిలుచున్నాఁడు.)