పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమ — వున్న ది. తప్పకుండావున్నది. (తనలో) ఇతడన్నమాట కర్ధంయేమిటో.

సుబ — వీణ్ని పిచ్చవాళ్ళ వైద్యశాలలోనుంచి తీసుకుని వచ్చి నట్టున్నారు.

సుమ —- మీమామయ్య కోనసీమ వెళ్ళినప్పుడు అమలాపురా న్నుంచి తీసుకునివచ్చినారు. (ఇంతలో జ్ఞప్తికితెచ్చుకొని) కాదుకాదు. పిచ్చవాళ్ళ వైద్యశాలలో నుంచే తీసుకునివచ్చినారు.

సుబ — (నవ్వుచు) సుమతీ! నీవలాగు తడబడుతూ మాట్లాడు తావేమి? నాదగ్గిర నీకుభయంయెందుకు? నీ కావుంగరం మామయ్య గారు కొత్తగా చేయించినారా? నీచేతిని వుండడంవల్ల ఆవుంగరానికి యెంతో అందంవచ్చింది. (అని చేయిపట్టుకొను చున్నాఁడు.)

సుమ - (చటుక్కున చేయితీసికొని తనలో) మాట్లాడడాన్ని పట్టిచూస్తే యితడు మంచివాడులాగే కనపడుతూ వున్నాడుకాని పిచ్చ వాడులాగు కనపడడం లేదు. (బిగ్గరగా) మీరువూరికేనన్ను స్తుతి చేస్తూవున్నారు.

సుబ — సుమతీ! సిగ్గువిడిచి దగ్గిరగా వచ్చికూర్చో. యెవరో కొత్తవాడిలాగునన్ను మీరూమీరూ అంటూవుండకు. మనలో మనకు మర్యాదలు యేమిటి? మునుపుపిలిచేటట్టుగానే నీవు అనిపిలుస్తూవుండు. మనం చెట్టాపట్టాలు వేసుకుని తోటలో తిరుగుతూ పళ్ళుకోసు కుని ఆడుకుంటూవుండేవాళ్ళం. ఆ సంగతంతా అప్పుడే మరిచి పోయి నావా?

సుమ - మరిచిపోలేదు. మనంవకరోజు శాస్తర్లగారి తోటలోకి వెళ్ళి నారింపండు కోసినప్పుడు జరిగినతమాషా నీకు యిప్పుడు జ్ఞాప కం వున్నదా?