పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము – అడుగో వకదాన్నివదిలి రెండో ఆడదానిమీద పడ బోతూవున్నాడు.

సుమ - నన్ను ముట్టుకోకు. పడుచువాళ్లు యెదిగిన ఆడదాన్ని ముట్టుకోరాదు. (తనలో) ఇతనిమోస్తరు చూస్తే నాకంతటిపిచ్చవా డుగా కనపడడం లేదు.

సుబ - దగ్గిరబంధువులలో అటువంటి అభ్యంతరాలు వుండకూ డదు. చిన్న తనంలో మనం యిద్దరమూ ప్రాణస్నేహితులముగా వుండే వాళ్ళముకామా?

సుమ – నాచెయ్యివదులు. చిన్నతనంలో చేసినట్టు యిప్పుడు చెయ్యరాదు. (అని చేయివదల్చుకొని వెళ్ళి బల్లమీద కూరుచున్నది.)

మతి - (రెప్పవాల్చక సుబలుని యోగదృష్టితో చూచుచు (తనలో) ఇతడు లొంగిపోయినాడు. కాస్తసేపు దృష్టిపట్టి చూచేటప్ప టికి పరమసాధువై నాడు. ఆహా! యేమియోగబలము? (బిగ్గరగా) అబ్బాయీ! నీకు ఆకలిగా వున్నట్టున్నది. నీవు కొంచెం సేపు నీమర దలితో మాట్లాడుతూకూర్చో. నేను లోపలికివెళ్ళి నీకు కావలసినవి జాగ్రత పెట్టించి యిప్పుడేవస్తాను. (అని సుమతియొద్దకు వెళ్ళి) అమ్మా యీ! నీవు కొంచెంసేపు యితనితో మంచిమాటలుచెప్పుతూ కూర్చో అతనుయేమన్నా అవునని అన్నిటికీ తలవూపుతూ వుండు. అతనికి వ్యతి రేకంగా యేమీచెప్పకు. వాళ్ళు చెప్పిందికాదంటే పిచ్చవాళ్ళకు పిచ్చ యెక్కువై కోపంవస్తుంది సుమా! (అని వెళ్ళుచున్నాఁడు.)

రాము — ఆయనలేనప్పుడు నేను మంత్రిస్తాను. (అని సుబలుని కేసి రెప్పవాల్చక చూచుచున్నాఁడు.)

సుబ - (చేతిలో రాముని జూపుచు) సుమతీ! వీడికి కొంచెం మతిభ్రమవున్న దనుకుంటాను.