పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(అప్పుడు మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు)

మతి – మావాడికి పిచ్చ మహాయెక్కువగావున్నది. నవుకర్ల నందరినీ కొడుతూ వున్నాడు. నేను యోగదృష్టితోచూచి యితణ్ని తక్షణం శాంతపరుస్తాను. (అని రెప్పవాల్చక చూచుచున్నాఁడు.)

సుబ — (మేనమామనుచూచి తొందరపడి) మామయ్యా! వీడు నావిపిచ్చిచేష్టలంటే కోపంవచ్చి కొంచెం జుట్టుపట్టుకున్నాను. అంతే కాని మరేమీలేదు.

మతి - (సుబలుని స్థిరదృష్టితో చూచుచు సమీపమునకు వెళ్ళి చేయిపట్టుకొని) నాడిబహువడిగా కొట్టుకొంటూవున్న ది. ఇటువంటి వాళ్ళకు వుండేమోస్తరే యిది.

సుబ — (తనలో) ఈయనకు మతిపోయిందా యేమిటి? రెప్ప వాల్చకుండా దయ్యాలు పెట్టేవాడులాగు నావంక అలాచూస్తాడేమి!

రాము - (మతిమంతుని వెనుకకువచ్చి చెవిలో రహస్యముగా) సమయానికి మీరురాక పోయినట్టయితే యితడు యీపాటినన్ను చంపి వేసును. ఇతనిది సాధారణ మయినపిచ్చ కాదు. యితణ్ని తాళ్ళోగీళ్ళో వేసికట్టిపెట్టి గదిలోవేసి వుంచవలెను. లేకపోతే మాయింటికి వచ్చేవా c రికి యెవరికై నా అపాయం వస్తుంది.

(అప్పుడు సుమతి ప్రవేశించుచున్నది.)

సుమ - (భయపడుచువచ్చి) నాన్నగారూ! (సుబలునిచూచి తొందరపడి) యిక్కడ మీరు వక్కరే వున్నా రనుకున్నాను.

సుబ - సుమతీ! నన్ను చూచి యెవరినో పరాయివాణ్ని చూచి నట్టు అలాతొందర పడుతావేమి! నేను నీబావను సుబలుణ్ని. నన్న ప్పుడే మరచిపోయినావా? (అని సుమతి చేయిపట్టుకొనుచున్నాఁడు.)