పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వ్యతిరేకంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చేతులు కలిపారు.టిపూను ఎలాగైనా తుదమిట్టించాలని కుట్రలు పన్నారు. మెసూరు రాణి శ్రీమతి లక్ష్మమ్మ మరోవెపు కంపెనీపాలకులతో చేతులు కలిపి, టిపూను ఎలాగైనా పరాజయం పాల్జేసి మైసూరు రాజ్యాన్నిదక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులకు ఆర్థికంగా సహాయం అందాజేస్తూ, టిపూను దెబ్బ తీయడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగింది. ఈ ప్రతికూల వాతావరణంలో మైసూరు రాజ్యాన్ని కాపాడుకోవటమే కాకుండ, బ్రిీషర్ల రాజ్యవిస్తరణ కాంక్షకుస్వదేశీ సంస్థానాలు బలి కాకుండ ఉండేందుకు టిపూ శత విధాల ప్రయత్నించారు.

ప్రజలకు, స్వేచ్ఛకు నిజమైన శతృవులు ఆంగ్లేయులన్న వాస్తవాన్ని గ్రహించిన ఏకైక స్వదేశీ పాలకుడు టిపూ. ఆ వాస్తవాన్ని ముందుగా గ్రహించారు కనుకు ఆతరువాతబ్రిీటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులకు ఆయన మార్గదార్శి ఆయ్యారు. (He was the only ruler who felt that the English are real enemies of people and freedom. He guided freedom fighters. - K.C. Menon, The Hindustan Times 16-11-1985)

బ్రిీటిషర్ల పట్ల అంతటి శతృత్వం వహించారు కాబట్టే, ఆయనంటే ఆంగ్లేయ చరిత్రకారులకు టిపూ అంటే ఆగ్రహం. కంపెనీ పాలకులు మాత్రమే కాకుండ ఇంగ్లాండులోని సామాన్య ప్రజలు టిపూ పేరు వినడానికి కూడ ఇష్టపడేవారు కారు. ఆ కాలంలో ఆంగ్లేయ మహిళలు ఏడుస్తున్నతమ బిడ్డలను సముదాయించడానికి టిపూ వచ్చి పట్టుకుపోతాడు అని భయ పట్టే వారని ప్రతీతి.

              స్వదేశీ ఉమ్మడి కూటమికి చివరికంటా ప్రయత్నం

బ్రిీటిషర్ల నుండి స్వదేశీ పాలకులకు పొంచియున్న పెను ప్రమాదాన్ని గ్రహించిన పాలకుడిగా, ఆయన ఎంతగా ఆంగ్లేయులను వ్యతిరేకించాడో, అంతగా స్వదేశీయుల ఉమ్మడి ప్రయోజనాల కోసం, స్వదేశీ పాలకుల సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ఏనాడూ బ్రిీషర్లుతో చేతులు కలిపి స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులకు నచ్చజెప్పేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కుట్రలతో, కుయుక్తులతో అటు నిజాం,ఇటు మరాఠాలు టిపూ మీద కత్తులు దూస్తున్నా, ఆయన మాత్రం ఆ స్వదేశీ పాలకుల స్నేహాన్నికాంక్షించారు. స్వదేశీ పాలకులతో కలిసి విదేశీ శత్రువు మీద రణభేరిని 44 24