పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్ పులి టిపూ సుల్తాన్

Tipu Sulthan have led to the worlds first war Rocket?) అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

                               బ్రిషర్లతో రాజీలేని పోరాటం

చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో, తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ, చిన్న వయస్సులోనే పలు విజయాలను సాధించారు. మలబారు ఆక్రమణతో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని విజయపరంపర అటు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఇటు స్వదేశీపాలకులైన నిజాం, మరాఠాలతో పోరుచేస్తూ ముందుకు సాగింది. చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయ ానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా టిపూ సుల్తాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతిగాంచారు. తండ్రి నుండి రాజ్యాధికారం పొందిన తరువాత టిపూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానదినుంచి, దాక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400 మైళ్ళు పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300 మైళ్ళు విస్తరించగలిగారు.

బలపడుతున్న మైసూరు రాజ్యాధినేత టిపూ వైభవప్రాభవాలను చూసి అసూయా ద్వేషాలతో రగిలి పోతున్న నిజాం నవాబు, మరాఠాలు ఏకం కావటమే కాక టిపూకు

యుద్ధారంగాన టిపూ సైన్యాలు

43