పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


                     మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

మ్రోగించానికి వ్యూహ రచన చేశారు. ఈ మేరకు స్వదేశీ పాలకులతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు అటు నైజాం పాలకులతో, ఇటు మరాఠాలతో పలు మార్లు సంప్రదింపులు జరిపారు. నిజాం కుటుంబంతో వివాహ సంబంధాల ఏర్పాటుకు కూడ ఆయన ప్రతిపాదానలు పంపారు. తమ స్వంత ప్రయోజనాలు తప్ప, నిస్వార్థదృష్టిలేని స్వదేశీ పాలకులు టిపూ ప్రతిపాదానలను త్రోసిపుచ్చారు.

ఆరోజు టిపూ ప్రతిపాదనలను విని స్వదేశీపాలకుల సమాఖ్య ఏర్పాటుకు అంగీకరించి ఉంటే భారత దేశ చరిత్ర మరొరకంగా ఉండేది. ఈవిషయాన్ని టిపూను పరాజితుడ్ని చేసిన గవర్నర్‌ జనరల్‌ వెల్లసీ స్వయంగా ప్రకటించటం విశేషం. ఆనాడుడు టిపూ మాటను స్వార్థపరులైన స్వదేశీ పాలకులు వినలేదు కాని, విని విన్నట్టయితే ఈగడ్డమీద మాకు (బ్రిీషర్లకు) నిలువ నీడ కూడ ఉండేది కాదు , అని అన్నాడు. ఈవ్యతిరేక పరిస్థితులను టిపూ చాలా చాకచక్యంగా ఎదాుర్కొన్నారు. బహిర్గత-అంతర్గత శతృవులను దారుణంగా దెబ్బతీసి ఆధిక్యతను నిలుపుకున్నారు.

టిపూ అధికారం చేపట్టగానే సైనిక వ్యవస్థను ఆధునీకరించారు. ఆధునిక ఆయుధలను, ఆ ఆయుధాలను ఉపయోగించే పద్దతులను, ఆందుకు అనుగుణంగా సైనిక వ్యూహాలలో మార్పులను ప్రవేశ పెట్టారు. మైసూరు రాజ్యలక్ష్మి చుట్టూత చుక్కూర్చుని ఉన్న శతృ వుల మూలంగా ఏర్పడిన ప్రత్యే క పరిసితు ల వలన, ఆకస్మి కంగా శతృవులు దాడి చేస్తే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు, ఏ క్షణాన్నైనా శతృవుమీద రణభేరి మ్రోగించేందుకు సైన్యాన్ని సర్వసిద్ధంగా ఉంచారు. ఈ మేరకు సైన్యాలను ఆయన ప్రత్యేక పర్యవేక్షణలోతీర్చి దిద్దారు. విదేశీ విజ్ఞానాన్ని సమకూర్చుకుని, ఆ విజ్ఞానానికి స్వదేశీ జ్ఞానాన్ని జోడించి ఆయుధాలను తయారు చేయించారు. ఆ ఆయుధాలఉపయోగించటంలో సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

టిపూ సెనిక పాటవాన్ని గమనించిన William Mc Taud టిపూ ఒక్కడే ఆనాడు సైన్యాన్ని చక్కని పథకం ప్రకారంగా శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దిన పాలకిడని (Tipu was the only ruler who trained his army in a well planned manner). కొనియాడాడు. ఈ తరహాలోనే బ్రిీటిష్‌ సైన్యాధికారి Compbell వ్యాఖ్యానిస్తూ ఆసియా లోని మిగిలిన రాజ్యాలలోని సౖౖెనిక వ్యవస్థల కంటె టిపూ సైనిక వ్యవస్థ చాలా ఉన్నత మైనదని (Tipus milatary organisation was better than those of all other regimes in Asia) అన్నాడు. టిపూతో స్వయంగా పోరాడిన Lord Cornwallis మాట్లాడుతూ, టిపూ సైన్యం ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యాలలో ఒకటని (Tipu's 45