పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మతం పట్ల విశాల లౌకిక దృక్పధం గల టిపూ, రాజాజ్ఞలను ఉల్లంఫిుంచిన వారు ఎంతటి వారైనా, వారే మతానికి చెందిన వారైనా కఠినంగా వ్యవహరించారు. స్త్రీలు రవికలను తప్పక ధరించాలని జారీ చేసిన ఆజ్ఞలను ఖాతరు చేయక పోవటమే కాక, బ్రిీటిషర్లతో చేతులు కలిపినందున, మంగళూరు క్రెసవులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు తొత్తులుగా మారి, మైసూరు రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించటం వల్ల టిపూ ఆగ్రహనికి గురయ్యారు. బహుభరృత్వాన్ని నిషేధిసూ, టిపూ జారీ చేసన ఆజ్ఞలను కూర్గు ప్రజలు ఉల్లంఫిుచారు. ఆచార సంప్రదాయాలలో సంస్కరణలకు సంబంధించి ఆయన జారీ చేసి ఆజ్ఞలను ఉల్లంఫిుచటమే కాకుండ, ఏకంగా టిపూ రాజ్యాధికారానికి ఎసరు పెట్టేందుకు శత్రువుతో కుమ్మక్కయ్యారు.

ఆకారణంగా ఆగ్రహించిన టిపూ కూర్గులను శిక్షించటంలో ఏ మాత్రం జాలి చూపలేదు. ఈ చర్యలన్నీ రాజకీయ కారణాల వలన చోటు చేసుకున్నవి తప్ప, మత మనోభావాల నేపధ్యం ఏమాత్రం లేదని, ప్రముఖ చరిత్రకారులు Dr Nigam (Tipu ki jeevan), Dr.Visweraiah (Bondage and Freedom) Mr.Rambha shya, Sundar తదితరులు తగిన ఆధారాలతో వివరించారు.

ఆ కాలపు పాలకుల పోకడలకు తగ్గట్టు శత్రువర్గాల పట్ల టిపూ ఎంత క్రౌర్యం చూపినా, మతం విషయంలో, ముఖ్యంగా హిందాువుల విషయంలో టిపూ క్రూరుడు కాదు. కెనరాలో క్రెసవుల మీద, మలబారులో నాయర్ల మీద అతడు విరుచుకుపడంది తనకు ఎదురు తిరిగారన్న రాజకీయ కక్షతో మాతమ్రే తప్ప మత ద్వేషంతో కాదు. నాయర్ల మీద అతడి ఆగ్రహంలోనూ వారి బహుబతృత్వం ఆచారం మీదా, మహిళలు అనాచ్ఛాదితంగా తిరగడంపైనా వ్యతిరేకతే ఎక్కువగా కన్పిస్తుంది. మొత్తంగా హిందూ మతం మీద విద్వేషంతో కత్తి ఎత్తి, పరిపాలనలో ముస్లింల పట్ల పక్షపాతం చూపి హిందువులను దుర్వికహణకు గురిచేసి, అన్ని విధాలుగా అణగదొక్కి బలవంతపు మత మార్పిడులను సాగించాడన్న నేరాలను అతడికి ఆపాదించడం అన్యాయం. (ఇదీ చరిత్ర,యం.వి.ఆర్‌.శాస్త్రి, దుర్గా పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌ 2005, పేజి. 201)

టిపూ ఆజ్ఞలను ఉల్లంఫిుంచిన ముస్లిం మోషిల్లాలను కూడ ఆయన కఠినంగా శిక్షించటమే కాక తిరుగుబాటును పూర్తిగా అణిచివేసారు. సౌవనూర్‌, కర్నూలు, కడప సంస్థ్ధానాలకు చెందిన నవాబులు టిపూకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నందున వారిని తన దారికి తీసుకువచ్చేందుకు చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో టిపూ మాత్రమే కాదు ఏ పాలకుడైనా తాను శత్రువుగా భావించిన వారి పట్ల ఆనాడు క్రూరంగానే వ్యవహరించారు. అందుకు టిపూ అతీతుడేంకాదు. 40