పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్ పులి టిపూ సుల్తాన్

that no such incident had taken place...' - Aurungzeb and Tipu Sultan :BN Pande, Page 14) ఫ్రొఫెసర్‌ శ్రీకాంతయ్య అంతటితో ఊరుకోలేదు, డా|| బియన్‌ పాండే ఆసక్తిని బట్టి టిపూ లౌకిక ప్రబువుగా రుజువు చేయు పలు పత్రాలను, ముఖ్యమెన డాక్యుమెంటుల కాపీలను ఆయనకు పంపారు. ఈ పత్రాలను పరిశీలించి టిపూ మీద దురుద్దేశ్య పూర్వకంగా సాగిన ఆరోపణల మీద శ్రీ శాస్త్రి పాత్ర గురించి డా|| పాండే ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజానిజాలను తెలుపమంటూ, శ్రీ కాంతయ్య స్పందనను, ఇతర పత్రాలను మరోసారి శ్రీ శాస్త్రి దృష్టికి తెస్తూ, ఆయన పాఠ్యగ్రంధంలో ఉటంకించిన సంఘటనకు తగిన ఆధారాలు చూపాలని కోరుతూ ఉత్తరం రాశారు.ఈ మేరకు ఎన్ని ఉత్తరాలు రాసినా డా|| శాస్త్రి నుండి ఎటువింటి ప్రత్యుత్తరం రాకపోవటంతో శ్రీ శాస్త్రి రాసిన మూడు వేల బ్రహ్మణుల ఆత్మహత్య సంఘటన వాస్తవం కాదని, అది డా|| శాస్త్రి అభూతకల్పన అని శ్రీ పాండే భావించారు.ఈ విషయం మీద మరింత పరిశోధన జరిపి, టిపూ మీద ఇటువంటి అసత్య ఆరోపణలను ఉదేశ్య పూర్వకంగానే కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డా|| హర ప్రసాద్‌ శాస్త్రి రాసారని శ్రీ పాండే నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన పత్రాలను కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ శ్రీ పాండే పంపారు. టిపూ మీద డాక్టర్‌ శాస్త్రి ఉద్దేశ్యపూర్యకంగా చేసిన అసత్య ఆరోణలను, ఆయన దృష్టికి తీసుక వచ్చారు. ఆ పత్రాలను పరిశీలించిన విశ్వవిద్యాలయం అధికారుల సిఫారస్సు మేరకు శ్రీ శాస్త్రి గ్రంథాన్నివిశ్వవిద్యాలయం సూచించిన పాఠ్య గ్రంథాల జాబితా నుండి తొలగిస్తూ, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు శ్రీ శాస్త్రి పాఠ్య గ్రంథాన్ని తొలగించారు. ఈ తొలిగింపు జరిగే సరికే పలు సంవత్సరాలు గడిచిపోవటంతో టిపూ మీద చేసిన అభాండాలు, అసత్య ఆరోపణలు అక్షరసత్యాలుగా బహుళ ప్రచారం పొందాయి. ఆ తరు వాత కూర్గు మలబారు హిందూ జనసమూహాల పట్ల చాలా దారుణంగా, అత్యంత క్రూరంగా టిపూ సుల్తాన్‌ వ్యవహరించారని ఆయనకు వ్యతిరేకంగా మరొక ఆరోపణ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆరోపణలలోని నిజానిజాల నిగ్గు తేల్చుతూ, టిపూ కఠినంగా వ్యవహరించింది వాస్తవమైనా, ఆ వ్యవహార సరళికి రాజకీయాలు మాత్రమే కారణమని, ఆయన కరిన వెఖరికి ఆయన మతం, మత విశ్వాసాలు ఏమాత్రం కారణం కాదని శ్రీ బి.యన్‌. పాండే లాింటి పలువురు పరిశోధకులు తేల్చి చెప్పారు. 39