పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్ పులి టిపూ సుల్తాన్

ఆంగ్లేయ సైనికాధికారిMajor Dirom ఈవిషమై వ్యాఖ్యానిస్తూ'..his cruelities were in general inflicted only on those whom he considered as his enimies' Jఅని అభిప్రాయపడ్డాడు. (Quoted by RC Majundar in his An Advanced History of India, Page 708)

టిపూ సుల్తాన్‌ ప్రదర్శించిన నిష్పక్షపాత, మత సామరస్య పూర్వక వెఖరి మూలంగా ఆయన పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రజల మన్నన పొందారు. టిపూ మత సామరస్య వైఖరిని కొనియాడుతూ, 1930 జనవరి 23 నాటి, యంగ్ ఇండియా లో మహాత్మాగాంధీ ఈ విధంగా పేర్కొన్నారు. 'విదేశీ చరిత్రకారులు ఫతే ఆలి టిపూ సుల్తాన్‌ను మత పిచ్చికలవాడిగ చిత్రించారు. తన రాజ్యంలో గల హిందువులను బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించాడని ఆరోపించారు. అతను అలాింటి వ్యక్తి కాదు. ఆయన మీద సాగిన పలు అసత్య ఆరోపణలకు భిన్నంగా, హిందూ ప్రజానీకంతో టిపూకు చాలా మంచి సంబంధాలు ఉండేవి' అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. ( "...Fathe Ali Tipu Sulthan of Mysore is represented by foreign historians as a fanatic, who opposed his Hindu subjects and converted them to Islam by force... But he was nothing of the kind. On other hand his relations with Hindu subjects were perfectly cordial.." Young India, Jan.23, 1930, Page. 31)

                        న్యాయవ్యస్థ పట్ల ప్రత్యేక దృష్టి

టిపూ న్యాయవ్యస్థ పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నారు. సమాజంలోని కొందరు వ్యక్తులు సాగించే కిరాతక చర్యలకు ఆ వ్యక్తిని మాత్రమే బాధ్యుడ్ని చేయాలి కాని, నేరం చేసన ఆ వ్యకికి చెందిన జనసముదాయానికి ఆ నేరాన్ని ఆపాదించడాన్ని నిందించడాన్ని టిపూ తీవ్రంగా పరిగణించారు. ఎవరు తప్పు చేస్తే వారిని మాత్రమే నిందించాలి, నేరం రుజువైతే తగిన విధాంగా శిక్షించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన యావత్తు సమాజాన్ని తప్పు పట్టడం అహేతుకం అన్నారు.

నేరస్తులకు శిక్షలు విధించటంలో వినూత్న మార్పులను ఆయన అమలు చేశారు.శిక్ష అనేది సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని ఆయన భావించారు. ఈ మేరకు పలు చర్యలను తీసుకున్నారు. చిన్న, చిన్ననేరాలకు పాల్పడిన, సామాన్యులకు రైతులకు జైలు శిక్షలు జరిమానాలు విధించటాన్ని మాన్పించారు. నిందితుడు తప్పు చేశాడని రుజువెనట్టయితే గతంలోలా జరిమానా విధించడాన్ని తొలగించారు. జరిమానా సొమ్ముకు


41