పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆచార-సంప్రదాయాలను గౌరవించి, విచారణ సమయంలో ఆయా అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు, ప్రధాన న్యాయస్థానాలలో అన్నిమతాలకు చెందిన న్యాయాధికారులను నియమించారు. ప్రజల ఫర్యాదులను, సమస్యలను వ్యకిగత చట్టాలను అనుసరించి విచారించమని, అధికారులను, న్యాయాధికారులను ఆదేశించారు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచారుల పట్ల ఎంతో గౌరవం, ఆదరణ చూపారు. మసీదుా -మందిరం-చర్చీల మధ్యన టిపూ ఎటువంటి తేడ చూపించలేదు. చర్చీల వివాదాల సందర్భంగా నిష్పాక్షికంగా వ్యవహరిం చటమే కాకుండ, ఆయా చర్చీల, ఆ చర్చీల నిర్వహకుల రక్షణకు పలు ఏర్పాట్లు చేశారు.

1791-92లో మెసూరు రాజ్య భాగమైన షిమోగా మీద దాడి జరిపిన మహారాష్ట్ర సర్దారు రఘునాధారావు పట్వర్ధన్‌, సమీపంలో ఉన్న శృంగేరి పీఠానికి చెందిన మఠం మీదా కూడ దాడి చేశాడు. ఆ దాడిలో మఠాన్ని కొల్లగోట్టి, బ్రహ్మణులను చంపి,శారదాలయంలో ఉన్న నగానట్టాను, విలువెన వస్తువులను దోచుకున్నారు. ఆలయంలోని శారదామాత విగ్రహాన్ని కూడ పెకిలించి బయటకు విసిరివేశారు.

ఈ దాడిలో మరాఠా దండు సాగించిన క్రూరత్వాన్నితట్టుకోలేక జగద్గురు సచ్చిదానంద భారతి మహాస్వామి మఠం వీడి మరోచోట తలదాచుకుని టిపూకు ఓ లేఖ ద్వారా దుస్సంఘటన వివరాలను తెలిపారు. టిపూ సుల్తాన్‌ సహయాన్ని సహకారాన్నీ ఆయన ఆ లేఖలలో అర్థించారు. ఆ లేఖకు తక్షణమే స్పందిస్తూ, జరిగిన సంఘటనకు తన బాధను వ్యకం చేసూ పీరాధిపతి లేఖకు సమాధానం రాస్తూ 'అంతటి పవిత్ర స్తలం మీద అలాింటి అకృత్యానికి పాల్పడిన వాళ్ళు పాపపలితాన్ని అనుభవించక తప్పదాని ' టిపూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిపూ అంతటితో సరిపెట్టుకోలేదు. ఆలయ పునరుద్ధరణ, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలకు అవసరమగు సహాయ-సహకారాలు అందించాల్సిందిగా, బేదనూరులో గల తన సర్దారుకు ఆదేశాలు జారీచేశారు. శారదా దేవి విగ్రహ పునóప్రతిష్ట జరిగాక జగద్గురు పంపిన శాలువా, ప్రసాదాన్నిఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం అమ్మవారికి కానుకలు, ప్రత్యేక వస్త్రాలను పంపారు.

ఈ సందర్భంగా జగద్గురుకు రాసిన లేఖలో, 'మీరు జగద్గురువులు. మీరు ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ:శాంతులతో గడపాలని కోరుకుంటూ సదా జపతపాలలో నిమగ్నమై యుంటారు. మా ప్రజలంతా సుభిక్షంగా 36