పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                     లౌకిక పభ్రువు

టిపూలౌకిక ప్రభువు. ఆయన చిన్నతనంలో, తండ్రి హైదర్‌ అలీ వద్దకు ఓ ముస్లిం ముల్లా ప్రముఖుడొకరు ఫిర్యాదు తెచ్చాడు. ప్రభువుకు తన ఫిర్యాదును విన్పిస్తూ, ఒక ముస్లిం రాజ్యంలో ముస్లిం ముల్లాలకు న్యాయం జరగటం లేదని నిందించాడు. ఆ ఆరోపణ వింటూనే, 'ఈ రాజ్యం ముస్లింలదని ఎవరన్నారు?' (Who told you that this was a Mussalman Government? ) అంటూ హైదార్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా మత మనోభావాలకు అతీతంగా రాజ్య నిర్వహణ సాగించిన తండ్రి బిడడు కావడంతో టిపూ కూడ మతాతీతంగా వ్యవహరించారు. ప్రజల మత విశ్వాసాలలో కలుగజేసుకోవద్దని అధికారులకు కూడ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. బహుళ మతాలు, జాతుల ప్రజలు సహజీవనం సాగిస్తున్న రాజ్యంలో అన్ని మతాలకు చెందిన ప్రజల పట్ల సమభావన చూపడం టిపూ ప్రత్యేకత. అందువలన ప్రతి ఒక్కరి మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. నైతిక విలువలకు భంగకరం కానంతవరకు ఎవరి మత ఆచారం-సాంప్రదాయాలను ఆయన పట్టించుకోలేదు. . ఒకసారి టిపూ వద్దకు ఒక పౌజ్‌దారీ వచ్చాడు. ఆయన ఒక ధర్మ సందేశం గురించి వివరిస్తూ, ఒక ముస్లిమేతర యువకుడు ముస్లిం బాలికను వివాహం చేసుకున్నాడని, దీనివలన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నదని పేర్కొన్నాడు. ఈ వివాహం విషయమై మరింత వివరణ ఇస్తూ, ఈ వివాహం షరియత్‌ ప్రకారం చెల్లదు,అందువలన నిందితులను శిక్షించేందుకు ఎటువంటి చర్య లు తీసుకోవాలో తెలుపమంటూ టిపూను అభ్యర్థించాడు.

(‘..a Hindu had married a Muslim lady causing tension in the locality. As such the marriage was not permitted in the Shariat, what action should be taken to punish the culprits ‘ - AURUNGZEB AND TIPU SULTAN, Evaluation of their Religious Polices, by Dr.B.N.Pande,Page. 19)

ఈ సమస్య విషయమై టిపూ స్పందిస్తూ, ప్రజల వ్యక్తిగత, మత సంబంధమైన విషయాలలో ఎటువింటి జోక్యం చేసుకున్నాసహించేది లేదని, శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల ఆస్తులను రక్షించడం అధికారుల పూర్తి బాధ్య తగా గుర్తించుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సరైన న్యాయం ప్రసాదించేందుకు, అన్నిమతాల 35