పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ఉండలని భగవంతుడ్ని ప్రార్ధించండి. మీలాింటి మహనీయులు ఎక్కడ నివసిస్తారో ఆదేశంలో మంచి వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి.', అని జగద్గురు పట్ల తనకున్నగౌరవాన్ని టిపూ వ్యక్తం చేశారు. ( ‘ You are the Jagdguru, Your are always performing penance in order that whole world may prosper, and the people may be happy.Please pray God for increase of our prosperity. In whatever country holy persons like yourself my reside that country will flourish with good shows and crops ‘ - The Tigers of Mysore by Proxy Fernandez, page.212)

                         ఉద్దేశ్యపూర్వక వక్రీకరణలు

టిపూ సుల్తాన్‌ మత సామరస్యాన్నిఎంతగా పాిటించినా, ఈ గడ్డను ఆక్రమిం చుకున్న బ్రిీటిషర్లు, ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న స్వదేశీ చరిత్రకారులు, టిపూను ముస్లిమేతర మతస్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన మతోన్మాదిగా చిత్రించారు. ఆ మేరకు బహుళ ప్రచారం చేశారు. ఈ ప్రచారం చాలా కాలం వరకు సాగింది. ప్రజలు,ప్రముఖులు కూడ అసత్యాలను-అర్ధ సత్యాలను, వక్రీకరణలను సత్యాలుగా నమ్మటం జరిగింది. ఈ కారణంగా టటిపూ గురించి పలు దుర్భావనలు కొంతకాలం చోటు చేసుకున్నాయి.

ఈ అసత్యాలు ఎంతో కాలం నిలబడలేదు. అనంతర కాలంలో సాగిన పలు పరిశోధనలు, పరిశోధకుల కృషి వాస్తవాలను నిగ్గుతేల్చింది. నిజాయితీ నిబద్ధతగల పరిశోధకులు, వాస్తవిక చరిత్రను ప్రజల ముందుకు తెచ్చారు. ఆ కృషి వలన అసత్యప్రచారం, వక్రీరణల వెనుక గల వ్యక్తుల-వ్యవస్థల దురుద్దేశాలు బహిర్గతయ్యాయి. టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడినందున మతాంతరీకరణ యిష్టంలేని మూడు వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ ఆత్మహత్యల దాుస్సంఘటనలకు ిపూ కారణమని ప్రధానంగా ఆరోపణ వచ్చింది. (Three Thousand Brahmins committed sucide as Tipu wanted to convert them forcibly into the fold of Islam. -Aurungzeb and Tipu Sultan : BN Pande, Page. 14)

ఈ ఆరోపణలను కలకత్తా విస్వవిద్యాలయానికి చెందిన సంస్కృత విభాగం అధిపతి డా. హర ప్రసాద్‌ శాస్త్రి తాను రాసిన మెిట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో 37