పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

విశ్వవిద్యాలయం ఏర్పాటు సంకల్పం ప్రజలను విద్యావంతులుని చేయటానికి టిపూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యను నిర్బంధం చేసి, ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. పలు విద్యాలయాలను ఏర్పాటుచేయించారు. బాగా చదువుకునే బిడ్డలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. చదువుపట్ల ప్రత్యే క దాృష్టిగల ఆయన విజ్ఞానార్జనకు ప్రయ త్నించే ప్రతివారిని చాలా గౌరవించారు.మైసూరు రాజ్య రాజధాని శ్రీరంగపట్నంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టిపూ సంకల్పించారు. ఆ విశ్వవిద్యాలయానికి JAMIAL UMUR అని నామకరణం చేయాలని ఉవ్వీళ్ళారారు. ఆ విస్వావిద్యాలయంలో భారతీయ విజ్ఞానంతో పాటుగా, పాశ్చాత్యవిజ్ఞానాణ్ణీ బోధించాలని, మానవీయ, సాంకేతిక విద్యాభ్యాసానికి అగ్రస్థానం కల్పించాలని ఆశించారు. ఆ మైసూరు సూర్యుడు ఆకస్మికంగా అస్తమించటంతో విస్వావిద్యాలయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది. ఆనాితీ తీపూ కలను నిజం చేస్తూ, ఆయన ఆశించిన రీతిలో కాకపోయినా ఆయన గౌరవార్థం ఆయన జన్మస్థానంలో ఆయన పేరిట విస్వావిద్యాలయం ఏర్పాటు చేయాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతగు చర్యలను తీసుకొంటుంది. ఈ విషయాన్నిఆ రాష్ట్ర మైనారిటి సంక్షేమ శాఖామాత్యులు అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌ 2006 జనవరిలో ప్రకటించారు. అలీఘర్‌లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలా టిపూ జన్మించిన దేవనహళ్ళి ప్రాంతంలో ఆయన గౌరవార్థం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు. (The Mali Gazette,16-21 Jan 2006 Page. 20)

                   మతాభిమాని తప్ప మత దురభిమాని కాదు

టిపూ సుల్తాన్‌ ఇస్లాం ధార్మానురక్తుడు. మంచి ముస్లిం. అనునిత్యం దైవనామ స్మరణతో, అయిదు పూట్ల నమాజులు అదా చేస్తూ, ఆయన రోజువారి జీవనం సాగింది.ఆయన స్వమతం పట్ల అభిమానం గల ప్రబువు తప్ప , మతదు రబిమానికాదు. మతపజక్షపాతిఅంతకంటే కాదు. ఆయన ప్రజలు ఏ మతస్థులైనా ఏ విషయంలో కూడ ఆయన వివక్షత చూపలేదు. భూమి శిస్తు, వృత్తి-వ్యాపారాలపై పన్నులు, శాసనాలు రాజ్య ప్రజలందరికి సమానం.బంధు ప్రీతికి దూరంగా సమర్దతకు , విశ్వాసానికి ఆయన పట్టంకట్టారు

31