పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సంబంధించిన సమాచారం మాత్రమే అందించేది కావటంతో సామాన్య ప్రజల వరకు అది చేరలేదు. టిపూకు అరబ్బి, పర్షియన్‌, కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు బాగా తెలుసు. ఆయనకు హస్తసాముద్రికం, జ్యోతిశ్శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. నిరంతరం యుద్ధాలలో మునిగితేలుతున్న సుశిక్షితుడైన పోరాటయోధుడు అయినప్పికి ఆయన సంగీతంలో కూడ మంచి ప్రతిభ చూపారు. ఆయన స్వయంగా పలు పాటలు రాసి వాటికి బాణీలు కూడ కట్టారని, అటువంటి ఓ పాటను యుద్ధ సమయాలలో సైనికులను ఉత్తేజితులను చేసేందుకు ఆ పాటను మార్చింగ్ సాంగ్ గా వాడేవారని,ప్రముఖ రచయిత మొహమ్మద్‌ షౌకత్‌ మీర్జా తన గ్రంథం ' బసేరా ' లో ఉటంకించారు.ఆయన స్వయంగా ఆలిమ్‌, ఫాజిల్‌ మాత్రమే కాకుండ ఖురాన్‌ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా అధ్య యనం చేశారు. నిత్య జీవితంలోని సమస్యలకు ఖురాన్‌ గ్రంథం నుండి ప్రవచనాలను అతి సునాయసంగా ఉల్లేఖిస్తూ, పరిష్కార మార్గాలు సూచించే వారు. టిపూకు అక్షరం అంటే మహాప్రీతి.ఆయన వివాహ సమయంలో వివాహ కానుకగా ఏది కావాలో కోరుకోమని తండ్రి హెదార్‌ అలీ అనగా, తనకొక గ్రంథాలయం కట్టివ్వమని తండ్రిని కోరారు. ఆ కోరికతో మహానందపడన హెదర్‌ అలీ గ్రంథాలయాన్ని నిర్మించి ఇవ్వటమే కాకుండ, దేశ విదేశాల నుండి పలు భాషలలో గల అనేక గ్రంథాలను తెప్పించి టిపూకు కానుకగా ఇచ్చారు. టిపూ గ్రంథాలయం విలువైన 2 వేల పుస్తకాలతోనిండి ఉండేది. ఆయన గ్రంథాలయంలో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు స్వదాస్తూరితో రాసిన ఖురాన్‌ కూడ ఉంది. ఈ గ్రంథాలను ఓ పద్దతి ప్రకారం జాగ్రత్త పర్చేవారు. టిపూ ఓ గ్రంథం తీసుకుని దానిని చదవడం పూర్తి చేశాక, ఆ గ్రంథం మీదా ప్రత్యేక ముద్రను వేయటం అధికారుల రివాజు. 1799లో శ్రీరంగ పట్నాన్ని దోచుకువన్నబ్రిీటిషర్ల కూటమి సాగించిన విద్వంసానికి ఈ గ్రంథాలయం కూడ గురి కావటంతో అందులోని అపూర్వ గ్రంథాలు కనుమరుగైపోయాయి. టిపూ నిరంతరం రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలలో మునిగి తేలుతూ కూడ ప్రతిరోజు ఏదో ఒక పుస్తకాన్ని కొంతసేపన్నాచదవనిదే విశ్రమించేవారు కారు. ఈ రకంగా ఆయన దేశ విదేశాల నుండి గ్రంథాలను తెప్పించుకుని అధ్యాయనంచేసినందున అధునిక భావనలను,సాంకేతిక విజ్ఞానాన్ని బాగా సంతరించుకున్నారు. ఈపరిజ్ఞానాన్ని మైసూరు రాజ్య పటిష్టతకు, మైసూరు రాజ్య ప్రజల సంక్షేమానికి టిపూ వినియోగించారు. 30