పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

             శ్రీరంగపట్నంలోని టిపూ సుల్తాన్‌ నిర్మించిన మస్జిద్‌-వి-ఆలా

ఒకసారి టిపూ వద్దకు ఎవరో వచ్చి, బ్రాహ్మణులు నమ్మదగ్గవారు కారని ఆరోపించాడు. ఈ ఆరోపణ వింటూనే ఆగ్రహించిన టిపూ ప్రతిస్పందిస్తూ, తన తండ్రి హైదార్‌ అలీతోపాటు తాను కూడ ఎంతగానో గౌరవించే శ్రీ పూర్ణయ్య (బ్రాహ్మణులు) సేవలను ఆయన ఉటంకించారు. ఎవరి పాప పుణ్యాలు వారివి మాత్రమే, ఎవరు నేరం చేస్తే వారికి మాత్రమే శిక్ష అంటూ, ఖురాన్‌ గ్రంథంలోని ప్రవచనాలను ఉటంకించారు. ఈ రకమై ఫిర్యాదులను భవిష్యత్తులో తన వద్దకు తీసుకొని రావద్దని,ఫిర్యాదులతో వచ్చిన పెద్ద మనుషులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. టిపూ రాజ్యంలోని పలు ప్రముఖ పదవులలో ముస్లింలు మాత్రమే కాదు అత్యధిక పదవులలో ముస్లిమేతరు లు ఉన్నారు. శ్రీ పూర్ణయ్య (ప్రదాన దివాన్‌), శ్రీకృష్ణారావు(ఆర్థిక శాఖ) శ్రీ శామయ్య (నిఘా విభాగం) శ్రీ అప్పాజీ, శ్రీనివాసరావు, శ్రీ మూల్‌చంద్‌,శ్రీ సుజన్‌రావ్‌(దౌత్య ప్రతినిధుా లు), శ్రీహరిసింగ్, శ్రీరామారావు, శ్రీ శ్రీపాల్‌ రావ్‌ (సెన్యం) తదితరులు ముఖ్యులు. టిపూ సైన్యంలోని పందొమ్మిది మంది సేనాధిపతులలో పదిమంది, పదమూడు మంది మంత్రులలో ఏడుగురు హిందువులని శ్రీ బి.యన్‌. పాండే తన గ్రంధంలో వెల్లడించారు. 32