పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

పాలు చేయకుండేందుకు అవసరమగు నిర్మాణాలను, ఏర్పాట్లను ఆయన ప్రత్యే క శ్రదతోచేయించారు. టిపూ స్వయంగా జాకోబియన్‌ క్లబ్‌ అను సంస్థ్ధను ప్రారంభించి, ఆ సంస్థ్ధ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటారు. ఆ మొక్కకుస్వేచ్ఛావృక్షం (Tree of Liberty) అని నామకరణం చేయటమే కాకుండ తనను తాను మైసూరు రాజ్యపౌరుడు గా (TIPU CITIZEN OF YSORE)పిలుచుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన కూడ ప్రజలకు, ప్రజాభిప్రాయానికి, ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఒక రాజరిక వ్యవస్థ్ధకు చెందిన పాలకుడు ఈ విధాంగా ప్రజాస్వామ్య భావాన్ని ప్రకటించటం అరుదైన విషయం. ఈ ప్రకటన టిపూలోని ఆధు నిక ప్రజాస్వామ్య భావన ఎంత బలంగా ఉండేదో వెల్లడి చేస్తుంది. టిపూ కేవలం ప్రజాస్వామిక భావనలతో సరిపెట్టుకోవటమే కాకుండ ఆ భావనలను, ఆనాటి వాతావరణంలో, అందుకు తగ్గట్టుగా ఆచరణలో పెట్టి అద్వితీయుడన్పించారు.

                     రాళ్ళెత్తిన కూలీలదే చరిత్ర

ప్రజల శ్రమకు తగిన ప్రతిఫలం సక్రమంగా అందాజేయాలని ఆదేశాలు జారీ చేసారు. టిపూకు అత్యంత ప్రీతిపాత్రమైన, ప్రఖ్యాత వేసవి విడిది గృహం దర్యా దౌలత్‌ నిర్మాణ సమయంలో ప్రజలచేత శ్రమదానం చేయించుకోవాలని అధికారులుసలహా ఇచ్చారు. ఈ సలహా పట్ల తీవ్రంగా స్పందిస్తూ, ఫారో ప్రభువులు తమ వద్దనున్న బానిసల చేత పిరమిడ్స్‌ను నిర్మించారు....స్రీల, పురుషుల మీద కురిసిన కొరడా దెబ్బలతో


మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

దార్యా దౌలత్‌

23