పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చైనా గోడ ఆద్యంతమూ రక్తంతో తడిసిపోయింది... మానవుల కన్నీళ్ళు, రక్తంతో మన ప్రాసాదాలు, రోడ్లు, డ్యామ్‌ల పునాదులు వేసినట్టయితే అటువంటి నిర్మాణాలు ప్రభువులకు ఎటువంటి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టవు, అని టిపూ వ్యాఖ్యానించారు. (‘....The Pharaohs built the pyramids with the labour of their slaves...The entire route of the Great wall of Chaina is littered with the blood and bones of men and women forced to work under the whip and lash of slavesdriver ..so...there can no glory or achievement if the foundations of our places,roads, dams are mingled with tears and blood of humanity..’ - ARUNGZEB AND TIPU SULTAN, Evaluation of their Religious Polices, by Dr.B.N.Pande, IOS,New Delhi, 1996, Page. 21)

ఈ మేరకు నిర్మాణాల విషయంలో చాలా అధునికవున అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తూర్పు నుండి పశ్చిమం వరకు ఉన్న ఏ దేశంలోనైనా నిర్మాణమై యున్నఅత్యంత గొప్ప కళాత్మక కట్టడల గురించి పరిశీలిస్తున్నప్పుడు, ఆ నిర్మాణాలకు ఆదేశం ఇచ్చిన ప్రభువులను కాదు మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది, ఆ నిర్మాణాలకు రూపు కల్పించిన ప్రజల శ్రమను, ఆ ప్రజలు పడన పాట్లను, ఈ నిర్మాణాల సమయంలో మృత్యువాత పడిన శ్రామికుల త్యాగాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి' అని పేర్కొంటూ రాళ్ళెత్తిన కూలీలకు ఆయన తన మనస్సులో పెద్ట పీట వేశారు. ( ‘....To my mind every great work of art and architecture be in countries to the west or to the east of India, is a monument not so much to the memory of those who ordered them to be built but to the agony and toil, blood and tears of those unfortunates who were driven out to death in the efforts to built it...’ - AURUNGZEB AND TIPU SULTAN,Evolution of their Religious Polices, by Dr.B.N.Pande, Page. 21)

ఈ మేరకు కూలివాని చెమట అతని శరీరం నుండి ఎండిపోక ముందే అతని కూలిని చెల్లిచాల్సింది గా ఆదేశించిన మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనం ప్రకారంగా దార్యా దౌలత్‌ నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులకు ఆయన ప్రతిఫలం చెల్లింపచేశారు.

                          ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ 

ప్రజల సంక్షెమం, భధ్రత పట్ల ఆయన చాలా శ్రద్ధ వహించారు. ప్రజలకు నష్టం కలిగించే శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. సహజంగా ప్రభువులకు ప్రభువులు శత్రువులవుతారు. టిపూ ఈ విషయంలో భిన్నత్వం ప్రదార్శించారు. ఆయన తన వ్యక్తిగత శత్రువుల కంటే తన ప్రజలకు ఇబ్బందులు కలగచేస్తూ శత్రువులుగా 24