పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దశలో మైసూరు రాజ్యంలోని ప్రజలందరికి సమానత్వం, సమానహక్కులను ప్రసాదించారు. ప్రజా ప్రభుత్వానికి ఆయన పునాదులు వేశారు. ప్రభుత్వంలో ప్రజలకుభాగస్వామ్యం కల్పించారు. ఈ మేరకు ప్రజల ప్రతినిధులతో కూడిన కమిటీలను నిర్మించారు. గ్రామాలలో, పట్టణాలలో ఈ కమిటీలలోని వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పాలనా పరమై న నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వినూత్నవిధానాలు అప్పటి ఆలోచనలకు-విధానాల స్థాయికి సరిపడలేదు. ఆంగ్లేయ చరిత్ర కారుడు M. Wikes తన History of Mysore గ్రంధంలో టిపూ ప్రజాస్వామిక ధృక్పధంఆచరణ గురించి ఈ క్రింది విధంగా అభివర్ణించాడు. ‘Democracy which was in vogue in France at that time was not alien to Tipu. He had granted equality and equity to all. Tipu sultan laidthe foundation of public Government in his reign. He made his subjects participate in administration by constituting a representative committee of the people. But the frame of mind and nature at that time could not accept this development.’ ( Tipu Sultan : Champion of Justice and Tolerance by G.Hasnan Kaif Publihed in Radiance Views Weekly 1-7 Aug.1999, Page. 24)

చరిత్రను లోతుగా అధ్యాయనం చేసిన టిపూ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారు. బ్రిీటిషర్ల బానిసత్వంణం నుండి 1783లో అమెరికా బయట పడినప్పుడు 108 ఫిరంగులను పేల్చి సంతోషం వ్యక్తం చేసారు. స్వేచ్ఛను కాంకి∆స్తున్న ప్రభువుగా, ప్రజలను బానిసల్లా భావించరాదాన్నవిధానాన్ని టిపూ అనుసరించారు.రాజ్య వ్యవస్థకు, నైతికతకు, ప్రజలకు నష్టం-కష్టం కల్గించనంత వరకు ఎవరి స్చేచ్ఛా-అవాతంత్య్రాలను హరించరాదాన్నది ఆయన అభిమతం. ప్రబువులు ప్రజలను తమ బానిసలుగానో, సేవకులుగానో భావించటం, వంగి వంగి అభివాదాలు చేయ టం ఏమాత్రం తగదని టిపూ తన అధికారులను హెచ్చరించారు.అధికారులు, ప్రజలు దార్బారుకు వచ్చినప్పుడు వంగి వంగి సలాములు చెప్పే పద్ధతిని ఆయన కూడదన్నారు. ప్రబువు కాళ్ళ వద్ద నిల్చోవడం, చేయి పట్టుకు ని ముద్దుపె పట్టుకోవటం లాింటి పద్ధతులు వలదాన్నారు. ఈ తీరు అహంకారానికి ప్రతీకగా భావించిన టిపూ అస్సలాము అలైకుం అంటూ సాదాసీదాగా పలకరిస్తే చాలంటూ ఫర్మానా జారీ చేశారు. మసీదుకు కాని,మరో బహిరంగ ప్రదేశాలకు గాని ప్రభువు వెళ్ళునప్పుడు ఆయన రాకపోకల కోసం మార్గాన్నినిరాటంకం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టటం సరికాదాన్నారు. ప్రజలను అవసల అవస్థల

22