పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వ్యవస్థ ఏర్పాటు, దోపిడికి కారణమైన మధ్యావర్తుల ప్రమేయంలేని క్రియాశీలక పాలనా వ్యవస్థను రూపొందించారని ఆ ఆంగ్లేయుడు పేర్కొన్నాడు.

( “The administration of Mysore kingdom under Tipu Sulthan was surprisingly based on modern principles... Tipu Sultan’s welfare state was based on some fundamental principles - viz. A strong Central Government, a coordinated provincial administration, dynamic and good civil amenities, principled legal system and elimination of intermediary (exploiting) channels... “ TIPU SULTAN THE GREAT: Glimpses of His Work and Personality, By Mufthi Shamshuddin Ahemed, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 35)

ప్రభుత్వాధికారులను ప్రజలకు చేరువ చేయటం, ప్రజలను కూడ ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములను చేసేందుకు టిపూ ప్రత్యేకమై పద్దతులను అనుసరించారు. ప్రతి నూతన సంవత్సరం తొలి రోజున అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాలు గల ప్రాంతాలలో ప్రత్యే క కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.బహిరంగ సభలను నిర్వహించాలని, ఆ సభలలో బాధ్యులైన అధికారులందరు పాల్గొనాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ సందర్భంగా తమతమ పరిధిలలో గల ప్రజలను ఆహ్వానించి నూతన సంవత్సర శుభాకాంక∆లు చెప్పాలని, ఆ విధంగా వచ్చిన ప్రజల గౌరవార్థం సుగంధ ద్రావ్యాలు, తమలపాకులు ఇచ్చి పంపాలన్నారు. ఈ సభలలో ప్రజల అవసరాల గురించి, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాల గురించి ప్రజలతో చర్చించాలని, ఈ మేరకు నివేదికలు తయారు చేసి తనకు పంపాలని టిపూ ఆదేశించారు.

టిపూ సుల్తాన్‌ ఆధునిక భావాలకు అనుగుణంగా ఆనాడే వ్యవహరించారనడానికి

క్రమం తప్పకుండ ఆయన సాగించిన జనాభా లెక్కల సేకరణను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనకు ముందు ఎవ్వరూ ఆలోచించని జనాభా లెక్కల సేకరణను టిపూ జరిపించారు. పట్టణాలు, పల్లెలలో జనాభా లెక్కలతో పాటుగా ఆయా ప్రజలు కలిగియన్న ఆస్తిపాస్థులను కూడ నమోదు చేయించారు.

                      రాజరిక వ్యవస్థలో ప్రజాసాfiమ్య ప్రేమికుడు

ప్రజాస్వామిక వ్యవస్థ కానప్పటికి ప్రజలకు, ప్రజాభిప్రాయానికి టిపూ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రపంచంలోని పలు వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నఆయన ప్రజల మాటకు అత్యంత విలువనిచ్చారు. ఫ్రాన్సులో ప్రజాస్వామ్యం అస్పష్టంగా ఉన్న 21