పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

                                     రాజ్యాభిషేకం

మైసూరును దక్షిణాదిలో బలిష్టమైన రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదార్‌ అలీ శతృవుల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకునేందుకు, తన జీవితంలోని అత్యధిక కాలం రణభూమిలోనే గడిపారు. శత్రువుతో కలబడుతూనే 1782 నవంబరు6న, రణరంగంలో తుదిస్వాస వదిలారు. ఈ విషాద వార్త టిపూకి అందేసరికి ఆయనమలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి తరిమి కొడుతున్నారు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1782 డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబ్టారు. చిన్న వయస్సులోనే సొఎర్యపత్రా పాలతో ప్రజలను ఆకట్టుకున్న టిపూ, మైసూర్‌ సుల్తాన్‌ అయ్యారు.టిపూ రాజ్యధికారంచేపటడ మైతే సులభంగా జరిగింది కాని, దక్షిణ బారతదశంలో మైసూర్‌ బలమెన స్వతంత్ర రాజ్యంగా రూపొందాటం ఇష్టంలేని నిజాం, మరాఠా పాలకుల నుండి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మైసూరు రాజ్యలక్ష్మిని కాపాడుకోవటం కోసం, టిపూ డేగ కళ్ళ తో రాజ్యంలోని ప్రతి పాంత్రాన్ని కడు జాగ్రతగా రక్షిచుకోవాల్సి వచ్చింది.

టిపూ తండ్రి హైదార్‌ అలీ

              ఫొటో

14 9