పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                     పదిహేనేళ్ళకే యుద్ధ వీరుడు

పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రాజ్యపాలన వ్యవహారాలలో, తండ్రితోపాటుగా యుద్ధాలలో పాల్గొన గలిగిన స్థాయినీ, సామర్థ్యాన్నీసంపాదించుకున్న టిపూ 1763లో జరిగిన మలబార్‌ పోరాటంలో తొలిసారిగా పాల్గొన్నారు. 1769-72 వరకు మరాఠాలతో సాగిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.తండ్రికి తగిన తనయుడు అన్పించుకున్నారు. ప్రథమ మైసూరు యద్ధంలో బ్రిీటిషర్ల కూటమి నుండి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో భాగంగా ఎంతో చాకచక్యంగా దౌత్యం నడిపి 17 సంవత్సరాల టిపూ విజయం సాధించారు. ఆనాడు టిపూ ప్రదర్శించిన రాజనీతికి ముగ్ధుడైన నిజాం, టిపూను ఫతే అలీ ఖాన్‌ బిరుదుతో సత్కరించి గౌరవించారు.

మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

తండ్రిలాగే యుద్ధ కళలో ప్రావీణ్యత సంపాదించిన టిపూ పురాతన సంప్రదాయ యుద్ధరీతులను అనుసరిస్తూ, పాశ్చాత్య యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా సైన్యాన్ని ఆధునీకరించి మంచి తర్పీదు ఇప్పించారు. సరికొత్త ఆయుధాలను యుదావ్యూహాలను రూపొందించి విజయాలకు రాచబాట వేసారు. 1780లో కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ని తరిమి క్టొిన చారిత్రక సంఘటనలో ప్రముఖ పాత్ర వహించారు.ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకొని, ప్రఖ్యాత ఆంగ్ల సేనానులు జనర్‌ లారెన్స్‌, రాబర్ట్‌ క్లివ్‌ సైన్యాల కంటె బలమెన సెన్యాలను కలిగి ఉన్న తమకు మొదటిసారిగా భారతీయ సైన్యాలను ఎదాుర్కొనలేక పారిపోవాల్సిన పరిస్థితి దాపురించిందని, ప్రస్తుతం టిపూ సైన్యాల ఎదుట నిలువలేక వెన్ను చూపాల్సిన దుస్థితి కలిగిందని, ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ గ్రంట్ పేర్కొన్నాడు. ('An English army much superior to one which under a Lawrence or Clive, five and twenty years ago, made Hindoostan, nay some of powers of Europe tremble at the bare fact of its victories, now for the first time were retreating in the face of an Indian army.' -TIPU SULTAN

HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page .14)

13