పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి ిపూ సుల్తాన్‌

ప్రజల అండదాండలు ఉన్నట్టయితే ఎటువంటిబలమైన శతృవునైనా అతి తేలిగ్గా ఎదుర్కోవచ్చని ఆయన భావించారు. ప్రభువుకు ప్రజల శక్తి ఎంత అవసరమో గ్రహించిన ఆయన ఆ దిశగా తన రాజకీయ-పరిపాలనా విధానాలను రూపొందించుకున్నారు. ఆ కారణంగా, ప్రజల సంక్షేమంలో రాజ్యక్షేమం, రాజు సంక్షేమం దాగుందాన్న సత్యాన్నిఅర్థం చేసుకున్న టిపూ సుల్తాన్‌ తన రాజ్యాభిషేకం రోజుననే ప్రజల నుద్దేశించి మ్లాడుతూ, మిమ్ముల్ని వ్యతిరేకించినట్టయితే నేను నా స్వర్గాన్ని, నా జీవితాన్ని, నాసంతోషాన్ని కోల్పోవచ్చు. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం వారి సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకుఏది ఇష్టమో దానిని నా మంచిదిగా భావిస్తానని ఆయన ప్రకటిచారు. (‘May I be deprived of heaven, of life, off spring if I oppose you. In the happiness, in their welfare my welfare; whatever pleases myself I shall consider not good, but whatever pleases my subjects I shall consider as good..’ - AURUNGZEB AND TIPU SULTAN, Evolution of their Religious Polices, by Dr.B.N. Pande, IOS, New Delhi, 1996, Page. 21)

              జనరంజక రాజ్యపాలన

ఒకవైపు టిపూను దెబ్బతీయడనికి అదను కోసం ఎదురు చూస్తున్న స్వదేశీ శత్రువులు, మరొకవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువులతో మైసూరు రాజ్యం చుట్టుముట్టబడి ఉండటంతో, శ్వాస పీల్చుకోవానికి కూడతీతీరిక లేనప్పికీ, ప్రజారంజకమైన పాలనను అందిస్తూ, ప్రజల ఆర్థిక వ్యవహారాలలో టిపూ చూపిన శ్రద్ధను గమనించిన ఆంగ్లేయాధికారి గ్రాంట్, ఆయన చర్యలను ప్రశంసిస్తూ టిపూ తన రాజ్యం యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్వహించిన తీరు అందరికి ఆదార్శంగా నిలచిపోతుందని, ('...How Tipu organised the economic resources of the kingdom set an example...') అనటం విశేషం. ప్రతిభావంతంగా ఆయన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దటం వలన రాజ్యంలో ప్రజలు సుఖ-శాంతులతో జీవనం సాగించగలిగారు.

ప్రజల జీవితాలను సుఖమయం చేసేందుకు టిపూ వినూత్న విధానాలను అనుసరించారు. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేసారు. అన్ని ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్నిరంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేసారు. స్వదేశంలోనే కాకుండ, విదేశాలలో కూడ పరిశ్రమలను స్థాపించి 15