ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంఘసంస్కరణ ప్రవీణుల
సంగతుల మెలగి,
యిల్లు జేరితి నాటి వేకువ;
జేరి, ప్రేయసి నిదుర లేపితి;
"కంటి వే" నేనంటే, “మింటను
కాము బాణం బమరియున్నది.”
తెలిసి, దిగ్గున లేచి, ప్రేయసి
నన్ను గానక, మిన్ను గానక,
కురులు, సరులును కుదురు జేయుచు
ఓర మోమిడ, బల్కితిన్,
“ధూమ కేతువు కేతువనియో
మోముచందురు డలిగిచూడడు!
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా!
అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా.
అంతేకాని రవంతయైనను
వంత నేగతి కూర్చ నేర్చునె ,
నలువ నేరిమి కంతుయిదియన
నింగితోడవయి వ్రేలుచున్.
2