పుట:ముత్యాల సరాలు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముత్యాలసరములు

|

గుత్తునా ముత్యాలసరములు
కూర్చుకొని తేటైనమాటల,
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా,

మెచ్చనంటావీవు; నీ విక
మెచ్చకుంటే మించిపొయెను;
కొయ్యబొమ్మలె 'మెచ్చుకళ్ళకు
కోమలులసౌరెక్కునా?

తూర్పు బలబల తెల్ల వారెను, .
తోకచుక్కయు "వేగుచుక్కయు,
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
'నెడలి మెరసిరి మిన్ను వీధిని.

వెలుగునీటను గ్రుంకే చుక్కలు;
చదలచీకటి కదలబారెను;
యెక్కడనొ వోక చెట్టుమాటున
నొక్క కోకిల పలుకసాగెను.

మేలుకొలుపులు కోడికూసెను,
విరులు కన్నులు విచ్చిచూసెను;
ఉండి, ఉడిగియు, ఆకులాడగ,
కొసరెనోయన గాలివీచెను,

పట్టమున పదినాళులుంటిని
కార్యవశమున పోయి; యచ్చట