Jump to content

పుట:ముత్యాల సరాలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవుల కల్పన కలిమి నెన్నో
వన్నె చిన్నెలు గాంచు వస్తువు
లందు వెఱ్ఱి పురాణగాథలు
నమ్మ జెల్లునె పండితుల్.

కన్ను కానని వస్తుతత్వము
కాంచనేర్పరు లింగిరీజులు;
కల్లనొల్లరు;వారి విద్యల
కరచి సత్యము నరసితిన్.

దూరబంధువు యితడు భూమికి,
దారిబోవుచు చూడవచ్చెను
డెబ్భదెనుబది యేండ్ల కొక తరి
నరుల కన్నుల పండువై.

తెగులు కిరవని కతల పన్నుచు
దిగులుజెందు టదేటికార్యము?
తలతు నేనిది సంఘ సంస్కర
ణ ప్రయాణ పతాకగాన్.

చూడు మునుమును మేటి వారల
మాటలనియెడి మంత్ర మహిమను,
జాతిబంధము లన్న గొలుసులు
జారి సంపద లుబ్బెడున్.

ఎల్ల కోకము వొక్కయిల్లై
వర్ణ భేదము లెల్ల కల్లై,