పుట:ముత్యాల సరాలు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోడుదొంగని అత్తగారికి
తోచెనేమో యనుచు గుందితి;
కాలగతియని మామలెంతో
కలగ సిగ్గరినై.

చాలునహ! మీ చాకచక్యము.
చదువు కిదె కాబోలు ఫలితము!
ఇంతయగునని పెద్ద లెరిగిన
యింగిలీషులు చెపుదురా?

కోటపేటలు నేల గలరని
కోటివిద్యలు మీకు గరిపిరి;
పొట్టకూటికి నేర్చువిద్యలు
పుట్టకీట్లు కదల్చెనా?

కట్టుకున్నది యేమి కానీ;
పెట్టిపొయ్యక పోతెపోనీ;
కాంచిపెంచిన తల్లిదండ్రుల
నైన కనవలదో?

కలసి మెసగిన యంతమాత్రనె
కలుగబో దీయైకమత్యము;
మాలమాదిగ కన్నె నెవతెనొ
మరులుకొనరాదో?"

అనుచు కోపము నాపజాలక
జీవితేశ్వరి సరుల నామై