పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసేవాళ్ళు లేదా నాటకం ప్రదర్శించేవాళ్ళు. మాములుగా ఆదివారం నాడు ఒక పెళ్ళి కార్యం ఉంటే, శనివారం రాత్రిపూట రామ భజనం చేసేవాళ్ళు లేదా నాటకం ప్రదర్శించేవారు. ఆ నాటకాన్ని ఆచార్యుని 'వత్యారే' అనే వారు. ఈ రామ భజనం లేదా నాటకం గురించి పెద్ద పందిరి కట్టి దాంట్లో ఈ కార్యక్రమాలు జరిగేవి. తర్వాత గంగమ్మ పూజ కూడా ఆదివారం నాడే చేసేవారు. ఈ సందర్బంలో కూడా శనివారం రాత్రి పూట నాటకం ప్రదర్శించేవారు. ఈ గంగమ్మ పూజ 'అమ్మోరు' పండగలో ప్రసిద్దం. ఈపండగలో ఇతర ప్రాంతాల నుంచి తమ తమ చుట్టాల్ని ఆహ్వానిం చేవారు. ఈ పండగలో ఇతరులు కూడా పాల్గొనేవారు, ఎంతో వేడుకతో ఈ కార్యం జరిగేది. పైన చెప్పిన రామ భజనలూ, నాటకాలూ, పండగలూ మా పిల్లలను బాగా ఆకర్షించినవి. ఇలా మన భాషా సంస్కృతి ప్రభావం కూడా వాళ్ళ మీద పడింది. దీనితో మన తెలుగు భాషనీ, సంస్కృతినీ కాపాడుతూ సుమారు 1940 దాకా వచ్చారు మన పూర్వీకులు. ఈ సమయం దాకా సుమారు 50 - 60 మన తెలుగు వాళ్ళు తమ మాతృ భాష మాట్లాడేవారు. మొత్తం మీద సుమారు నూరు సంవత్సరం దాకా మన తెలుగు వాళ్ళలో తమ భాష మాట్లాడేవారి సంఖ్య 50 - 60

ఇకను మన తెలుగు భాష బోధన పరిశీలిద్దాం

1930 నుంచి 1945 దాక తెలుగు భాష బోధించేవారి సంఖ్య తగ్గిపోయింది. తెలుగు పాఠాలు చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణమేమిటో అది చెప్పడం చాలా కష్టం. ఈ తెలుగు భాష బోధించే వాళ్ళలో కొంత మందిని ఇక్కడ పేర్కొంటాను - శ్రీ పిచ్చయ్యగారు Goodlands నివాసి, అప్పల స్వామిగారు Quartier Militaire నివాసి, శ్రీశ్రీ అప్పన్న మరీకన్నయ్యగారు Mon Loisir నివాసులు, దానయ్యగారు BelElang నివాసి, జగన్న మరీ సనాసిగారు, Belle Vue Maurel నివాసులు, శ్రీ రామమూర్తి అప్పన్న Mahebourg నివాసి, శ్రీ గుణయ్య ఒత్తుగారు LaClemence నివాసి ఇంకా కొందరు ఉన్నారు. ఈ 1945 నుంచి మన తెలుగు భాషా సంస్కృతికి ఒక విధంగా అనారోగ్యం సంభవింపసాగింది. ఉదాహరణంగా కొందరి ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలతో తెలుగు భాషలో మాట్లాడుతుంటే వీళ్ళకి ఈ తెలుగు భాష అర్ధమయ్యేది కాని ఏదో కారణంగా వీళ్ళు బీహారీ భాషలో జవాబిచ్చేవారు. దీనికి పెక్కు కారణాలు ఉండవచ్చు.

మన తెలుగు వారి సంఖ్య చాలా తక్కువ. వీరు నివసంచే చోట్ల నలుపక్కలు బీహారీ భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. దారిలో ఇతర భాషలతో సహా బీహారీ భాషయే ఎక్కువ వినబడేది. మన తెలుగు బందుగులు, తమలో తెలుగు భాష