పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఓం నమః శివాయః సిద్ధం నమః అనే అక్షరాలు రాయిస్తూ గురువుగారు చదివించేవారు. ఈ అక్షరాలు బోధించే ముందు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే సరస్వతి ప్రార్ధన చేసేవాళ్ళు. అప్పుడు గురువుగారు మాములుగా 'అయ్యోరు' అనే పేరులో ప్రసిద్దులు. ఈతనే ఆదేవాలయానికి అర్చకుడు కూడాను. ఈతన్ని పూజారి అంటారు. మాములుగా గురువుగారు సోమవారం నుంచి గురువారం దాక విధ్యార్ధులకి పాఠాలు చెప్పేవారు, అంటే వారానికి నాలుగు రోజులు మాత్రం బడి చదువు ఉండేది. శుక్రవారం నాడు నైవేద్యంతో సహా వచ్చి దేవాలయంలో అర్చన జరిగేది. సభాసదస్యులు అందరును కూడి రామభజనలు, కీర్తనలు పాడేవారు, బడిపిల్లలు కూడా ఆ భజనలు, కీర్తనలు అనుసరించేవాళ్ళు. ఇంకను ఆ ఓనమాలు చదివిన తర్వాత, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋు ఋూ మొదలైనవి తర్వాత క ఖ గ ఘ చ చ జ ఝ ఞ మొదలైనవి. ఆ తర్వాత గురువుగారు విధ్యార్ధులచేత గుణింతాలు చదివించేవారు. చదవగలిగిన తర్వాత, ఒక విద్యార్ధి ముందు చెప్పేవాడు పిమ్మట తక్కిన విధ్యార్ధులు అనుసరించేవాళ్ళు అది ఎలా చెప్పేవారంటే : క కు దీర్ఘమిస్తే కా, క గుడిస్తే కి, కి కి గుడిదీర్ఘమిస్తే కీ, క కుకొమ్మిస్తే కు, కు కికొమ్ముదీర్ఘమిస్తే కూ మొదలైనవి. ఇది చిన్న గుణింతంతో ప్రసిద్దిగా ఉండేది. ఆ తర్వాత పెద్ద గుణింతాలు వస్తాయి. కక్కావత్తిస్తేక్క కక్తావత్తిస్తేక్త, కక్నావత్తిస్తే క్న, కక్మావత్తిస్తేక్మ, కక్యావత్తిస్తే క్య, కాక్రావత్తిస్తే క్ర, కక్షావత్తిస్తే క్ష, కక్వావత్తిస్తే క్వ మొదలైనవి.

ఈ పెద్ద గుణింతం తర్వాత పెద్ద బాల శిక్షలో చదివేవారు. ఆ సమయంలో మారిషస్ దేశంలో ఇప్పుడు మాదిరిగా కొత్త కొత్త పుస్తకాలు లేవు. మా తాత ముత్తాతలు నూట యాభై సం॥ల క్రింద ఈ మారిషస్ దేశానికి వస్తున్నప్పుడు తమ వెంట తెచ్చిన కొన్ని పాత పుస్తకాలు మాత్రమే. ఆ పుస్తకాల్లో పెద్ద బాల శిక్ష, బాల రామాయణం, పాత కుశలా యకము, కామమ్మ కధ, బాలి నాగమ్మ కధ, బొబ్బిలి కధ, రామదాసు చరిత్రము, యడ్ల రామదాసు చరిత్రము, తారకామృత సారము, నృసింహ శతకము, ఇంకా కొన్ని నాటకాల పుస్తకాలు వాటిలో రామ నాటకము, లవకుశ, రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద నాటకం, గంగా వివాహము మొదలైనవి. మొత్తం మీద రామ భజన మరీ నాటకాల పుస్తకాలే ఎక్కువగా ఉండవచ్చు. తమ తీరిక సమయాన మన పెద్దలు గుంపులుగా కూడి కామమ్మ కధ, బొబ్బిలి కధ లేదా బాల నాగమ్మ కధ చెప్పుకుని సంతోషించేవారు. శనివారం సాయంత్రం వేళ స్వేచ్చగా ఉండేవారు, కాబట్టి ఆ అవకాశం పురస్కరించుకుని అప్పుడప్పుడు రామ భజనం