పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రోడ్లనడుమ ఎర్రని రేడియం చారలు ఉంటాయి. అవి రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. పగటిపూట ఏమంత ప్రత్యేకంగానూ కనపడవు. ఒక క్రమపద్దతిలో అవి నడవటానికి తోడ్పడతాయి. బెంజి, ప్లిమత్, చవర్లెట్ లాంటి కార్ల వాడకం తక్కువ. చిన్న కార్లు అతి తక్కువగా కనిపించాయి.

ఆరోజు మధ్యాహ్నం మారిషస్‌లోని ఇండియన్ హై కమిషనర్ శ్రీ కె.కె.ఎస్. రాణా విదేశీ ప్రతినిధుల గౌరవార్ధం వాకోస్‌లోని ఇండియా హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. శ్రీ రాణా మా అందరితో ఎంతో కలివిడిగా తిరుగుతూ విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. చక్కని భోజనం పెట్టి అతిధి సత్కారం చేసిన శ్రీ రాణా ఆదరణ మరువరానిది.

భోజనానంతరం మధ్యాహ్నం 3 గంటలకు మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్లో మారిషస్‌లోని వివిధ సాంస్కృతిక సంస్థల వారు విదేశీ ప్రతినిధులకు పౌరసన్మానం చేశారు. డా#2405; సి.నారాయణరెడ్డి, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, డా#2405; అక్కినేని నాగేశ్వరరావు, శ్రీమతి జమునారమణారావు, శ్రీ నరిశింగరెడ్డి, శ్రీ రాజారెడ్డి శ్రీమతి రాధారెడ్డి, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, శ్రీ వేణుమాధవ్, శ్రీమతి శోభారాజ్ దక్షిణాఫ్రికా ప్రతినిధి వర్గం నాయకుడు శ్రీ ఆర్.యస్.నాయ్డులను వివిధ సంస్థలవారు పుష్చమాలలతో సత్కరించారు.

పౌరసన్మానంతరం మారిషస్‌లోని ఆంధ్ర కళాకారిణి శ్రీమతిశైలజా రాముడి కూచిపూడి నృత్యం కనుల విందు చేసింది. భామా కలాపాన్ని ఆమె ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించింది. నృత్య ప్రదర్శనకు ఆ నృత్య విశేషాన్ని అభినయపూర్వకంగా వివరిస్తూ ఇంగ్లీషులో ఆమె చేసిన వ్యాఖ్యానం ఆమె ప్రతిభను చాటింది. సత్యభామ విరహవేదనను హావ భావయుక్తంగా చక్కగా ప్రదర్శించింది. కేసెట్టు చేసిన పాటకు బదులు నేపధ్య సంగీతం ఉండి ఉంటే మరింత రక్తి కట్టి ఉండేది.

మహారామ భజనం

మారిషస్‌లో జరిగిన తెలుగు సభలకే వన్నె తెచ్చిన మహెూన్నత కార్యక్రమం మహారామ భజనము.

బియోవాలన్‌నగరం ఆ రోజు వేలాది ఆంధ్ర స్త్రీ, పురుషులతో నిండి ఉంది. 150 సంవత్సరాల క్రితం మారిషస్ దేశంలో అడుగు పెట్టిన తెలుగు తల్లి తనయులు తమతో వారసత్వ సంపదగా తీసుకెళ్ళిన సంస్కృతీ సాంప్రదాయం మహారామ