పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముగ జనించినవారైనను, శిశువులు ఎల్లరును సమానమయిన సామాజిక పరిరక్షణ ననుభవింతురు.
అనుచ్ఛేదము 26. (i) ప్రతి వ్యక్తికిని విద్యకు హక్కు ఉన్నది. ప్రాథమిక ప్రాతిపదిక దశల యందైనను విద్య శుల్క రహితమై యుండవలయును, ప్రాథమిక విద్య నిర్బంధము గావలెను. యోగ్యత ననుసరించి, యెల్లరకును పారిభాషిక వృత్తి విద్యలు, సాధారణముగా, నుపలభ్యములుగను, మరియు, నున్నత విద్య, సమానముగ నెల్లరకును, సుగమముగను చేయబడవలయును.
(ii) మానవ వ్యక్తిత్వ సమగ్ర-అభివృద్ధికిని, మానవ స్వత్వ ప్రాతిపదిక స్వతంత్రతా విషయిక గౌరవమును దృఢపరచుటకును, విద్యను ప్రవర్తింప జేయవలయును, అన్ని రాష్ట్రములకును, జాతి, లేక మత సంబంధమయిన వర్గములకును మధ్య, సమ్యగ్భావ, సహన, సౌహార్దభావములను, పెంపొందించవలయును. మరియు, శాంతి సంరక్షణకై ఐక్యరాష్ట్రముల కార్యకలాపమును చరింపజేయవలయును.
(iii) తమ బిడ్డలకు ఏ విధమగు విద్య అవసరమో నిర్ణయించుకొను ప్రాగధికారము తల్లితండ్రులకు గలదు.