పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహకారముల ద్వారా, ప్రతి రాజ్యముయొక్కయు వ్యవస్థాపనా సాధన సామగ్రి ననుసరించి, తన ప్రతిపత్తికిని తన వ్యక్తిత్వముయొక్క స్వేచ్ఛాభివృద్ధికిని అత్యావశ్యకములయిన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక స్వత్వముల సంపాదనకు అతనికి అధికారము గలదు.

అనుచ్ఛేదము 23. (i) పనికిని ఉద్యోగము పెంచుకొనుటలో స్వేచ్ఛకును, పని విషయమున న్యాయము ననుకూలమునగు పరిస్థితులకును, నిరుద్యోగమునుండి పరిరక్షింపబడుటకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.

(ii) సమాన కార్య నిర్వహణమునకు, సమాన వేతనమును, విభేద రహితముగ, పొందుటకు ప్రతి వ్యక్తికి నధికారము గలదు.
(iii) మానవ ప్రతిపత్తికి అర్హమగు జీవనమును తనకును తన కుటుంబమునకును సునిశ్చితము చేయునట్టిదియును, ఆవశ్యకమయినచో సామాజిక పరిరక్షా సాధనాంతరములచే పరిపూర్తిని పొందినట్టిదియు, న్యాయము ననుకూలమునయినదియునగు, పారితోషికమును పొందుటకు పని చేయు ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.
(iv) ప్రతి యొకరికిని, స్వీయ హిత రక్షణార్థము వ్యాపార సంఘములను గూర్చుటకును, వానిలో చేరుటకును హక్కు గలదు.

అనుచ్ఛేదము 24. పని కాలము యొక్క యుక్తపరిమితత్వమునకును, వేతన సహితములగు నియతకాలికములయిన సెలవు దినములకును, విశ్రాంతి విరామములకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.

అనుచ్ఛేదము 25. (i) ఆహార, వస్త్ర, ఆవాసస్థల, వైద్యోపచార, ఆవశ్యక సాంఘిక పరిచర్యలతో గూడినట్టిదియు, తనయోక్కయు తనకుటుంబముయొక్కయు ఆరోగ్యమునకును స్వాస్థ్యమునకును పర్యాప్తమగునదియునగు, జీవనప్రమాణమునకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు. మరియు నిరుద్యోగ, రుగ్మతా, అసమర్థతా, వైధవ్య, వార్ధక్యములనుండియు, లేక తన వశమునకతీతములయిన సందర్భములందు గలుగు జీవిక లోపమునుండియు, రక్షను పొందుటకు, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.

(ii) విశిష్ట ఉపచార సహాయములను పొందుటకు, మాతృత్వ శైశవములకు అధికారము గలదు. వైవాహిక సంబంధమున జనించిన వారైనను, తదన్య