పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుచ్ఛేదము 6. సర్వత్ర, విధిసమక్షమున నొక వ్యక్తిగా అంగీకరింపబడు నధికారము ప్రతి యొకరికిని గలదు.
అనుచ్ఛేదము 7. విధి సమక్షమున నెల్లరును సామానులు. మరియు, నెట్టి విభేదముగాని పాటించక, విధి యోసగు సమానమగు పరిరక్షణను పొందు నధికారము ఎల్లరకును గలదు. ఈ ప్రకటనను వ్యతిక్రమించు నెట్టి విభేదమునుండిగాని, అట్టి విభేదకారకమగు నే ప్రేరణనుండిగాని పరిరక్షింపబడుట కెల్లరకును సమానమగు హక్కు గలదు.
అనుచ్ఛేదము 8. సంవిధానముచే గాని విధిచే గాని యోసగబడిన మూలస్వత్వములను వ్యతిక్రమించు కార్యముల విషయమున, సమర్థమగు రాష్ట్రీయ న్యాయాధికరణ సభచే ఫలప్రదమగు ప్రతిక్రియను పొందుటకు, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.
అనుచ్ఛేదము 9. ఏ వ్యక్తినీ విధి విరుద్ధమైన నిర్బంధమునకుగాని, నిరోధమునకుగాని, నిర్వాసమునకుగాని లోబరుపగూడదు.
అనుచ్ఛేదము 10. ప్రతి వ్యక్తికిని, అతని స్వత్వములయోక్కయు ఆభారముయొక్కయు నిర్ణయమునందును, అతనిపైనున్న ఏ దోషారోపణయొక్క నిర్ణయమునందును, స్వతంత్రము, నిష్పక్షపాతమునగు న్యాయాధికరణ సభ యెదుట, న్యాయము, బహిరంగము నగు విచారణను పొందుటకు సమానమగు సమగ్రస్వత్వము కలదు.
అనుచ్ఛేదము 11. (i) దండనీయమైన నేరమారోపింపబడిన ప్రతియోకరును, తన ప్రతిరక్షకు ఆవశ్యకములగు అభయముల నన్నిటిని పొందియుండి, బహిరంగ విచారణలో విధిననుసరించి దోషిగా నిరూపింపబడునంతవరకు, నిర్దోషిగా పరిగణింపబడుటకు హక్కును కలిగియున్నారు.
(ii) ఏ కార్యముయొక్క ఆచరణగాని, తదాచరణలోపముగాని, రాష్ట్రీయము లేక అంతర్రాష్ట్రీయము నగు విధి ననుసరించి దండనీయమైన నేరముగా, ఆ నేరము జరిగిన సమయమున విధింపబడియుండలేదో, అట్టి యే నేరమునకై గాని, యెవరును దండనార్హులుగా పరిగణింపబడకూడదు. దండనీయమైన నేరము జరిగిన సమయమున ఆ నేరమునకై విధింపబడిన శాస్తికంటే నధికమగు శాస్తిని విధింపకూడదు.
అనుచ్ఛేదము 12. ఆంతరంగిక, కుటుంబ, గృహ, లేఖావ్యవహారములలో, విధి విరుద్