పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మయిన జోక్యమునకుగాని, గౌరవప్రతిష్థలను భంగపరచు ప్రచారములకుగాని యెవరిని గురిచేయరాదు. అట్టి జోక్యము నుండియు, ఆ ప్రచారముల నుండియు విధి ద్వారా పరిరక్షింపబడుటకు ప్రతి యొక్కరికిని హక్కు గలదు.

అనుచ్ఛేదము 13. (i) ప్రతి రాజ్యము యోక్కయు హద్దుల లోపల స్వేచ్ఛాసంచారమునకును, నివాసమునకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.

(ii) స్వదేశమునుండిగాని, ఏ ఇతర దేశమునుండుగాని ప్రవేశించుటకును, స్వదేశము మరలి వచ్చుటకును ప్రతి యొక్కరికిని హక్కు గలదు.

అనుచ్ఛేదము 14. (i) పరపీడనమునుండి రక్షణాశ్రయము నన్యదేశములలో నన్వేషించుటకును, అట్టి ఆశ్రయము ననుభవించుటకును ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.

(ii) రాజకీయములుగానట్టి నేరముల వలన యదార్థముగ నుత్పన్నములగు నట్టియు, లేక, ఈ ఐక్యరాష్ట్రసమితి యొక్క ప్రయోజనములకును సూత్రములకును విరుద్ధములు అయిన కార్యముల వలన ఉత్పన్నములగునట్టియు, అభియోగముల విషయములో పై హక్కులను అర్థించుటకు వీలు లేదు.

అనుచ్ఛేదము 15. (i) ప్రతి వ్యక్తికిని ఒక రాష్ట్రీయతకు హక్కు గలదు.

(ii) ఏ వ్యక్తిని గానీ, విధి విరుద్ధముగా మరియు, తన రాష్ట్రీయతను మార్చుకొనుటకతనికి గల హక్కును లేదనకూడదు.

అనుచ్ఛేదము 16. (i) యుక్తవయః పరిపూర్ణులయిన స్త్రీపురుషులెల్లరకును,- జాతీయ రాష్ట్రీయ మతాదిక పరిమితత్వము పాటింప బడక,- వివాహములు చేసుకొనుటకును, కుటుంబస్థాపన చేయుటకును హక్కు గలదు. వివాహ విషయమునను, వివాహకాలమునను, వివాహవిశ్లేష విషయమునను స్త్రీపురుషులకు సమానములగు హక్కులు గలవు.

(ii) ఉద్దిష్టులగు సతీపతులు తమ స్వేఛ్ఛాపూర్వక సంపూర్ణాంగీకారము తొడనే వివాహ విధి ప్రయుక్తులు గావలయును.
(iii) కుటుంబము, సమాజమునకు సహజమును, ప్రాతిపదికమునగు ప్రమాపకమూలమై యున్నది. కనుక నది సమాజము చేతను రాజ్యము చేతను పరిరక్షితమగుటకు అధికారము కలిగియున్నది.