పుట:మాటా మన్నన.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాట్లాడుతుంటే రెండవ వ్యక్తి కేవలం వినటం సంభాషణ కానేకాదు. అది ఉపదేశం, నీతిబోధ అవుతుంది. సంభాషణ అనగా ఇద్దరు కలిసి సంప్రదించుకోవటం అన్నమాట. ఒకరు ఒక విషయం చెప్పితే, రెండవవారు దానిని గురించి తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలి. 'ఆయనతో మాట్లాడాను. చాలా అద్భుతంగా ఉన్నది. అటువంటిది ఎప్పుడూ వినలేదు.' అనటం సంభాషణ కాదు. అబ్లామాట్లాడే వ్యక్తికి విషయవైవిధ్యం లేదనీ, ఆయన చెప్పిన వారిదగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకున్నాడన్నమాట. నీకు వినటంకాదు, నీకు తెలిసిన విషయాలను గురించి ఇతరులతో మాట్లాడటం, దానిపై ఇతరులు మాట్లాడటం అదీ సంభాషణ

సంభాషణఅంటే ఒకరు చెప్పుతూ ఉంటే ఊకొట్టటం కాదు, కలసి మెలసి మాట్లాడటం. రెండవవారు మాట్లాడుతుంటే బిడియపడి మాట్లాడకుండా ఉండరాదు. తాను కూడా మాట్లాడ ప్రయత్నిస్తే ఆ బిడియము అదేపోతుంది. Practice makes a man perfect. సాధనమున పనులు సిద్ధిస్తాయి. ఎవరూ ఏవిషయాలను పుట్టుకతో నే నేర్చుకొని రాలేదు. నిరంతర సాధనవల్ల నే గొప్పవారు కాగలరు.

గొప్ప తెలివి తేటలు గలవారుకూడా సంభాషణలో గొప్పవారు కారు. కవులు, గాయకులు, రాజకీయవేత్తలు ప్రఖ్యాతులై ఉండవచ్చును. వారి వారి వృత్తులలోనే ప్రఖ్యాతులుగాని సంభాషణలో అందరూ రాణించరు. దీనికి కారణం వారు వారి సంబంధంలేని విషయంలో జోక్యం కలుగచేసుకోకుండా ఉండటమే. అందుచేతనే వారి

53