పుట:మాటా మన్నన.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి సాదృశ్యంగా ఒకసంగతి చెబుతాను, కొందరు మహాబలిపురం చూడడానికి ఒక కారుమీద వెళ్ళారు. ఆ డ్రైవరు అనేకసార్లు వచ్చినవాడే, కానీ అతను ఎప్పుడూ చూడాలని తలచ లేదు. ఒకనాడు అందులో వచ్చినవారు ఆ డ్రైవరునుకూడా వెంట పెట్టుకొని వెళ్ళదలచారు. ఆయన రానన్నాడు. కాని వారు పదే, పదే చెప్పడంవల్ల వచ్చాడు. మొట్టమొదట ఆయన కేమీ నచ్చలేదు. కాని అవన్నీ చూచినందువల్ల ఆయనకు కూడా అభిరుచి కలిగింది. అనంతరం ఆయనకు వీటియందు అభిమానం అధికమై వాస్తు శాస్త్రాలు చదవసాగాడు. అభిరుచి, అభిమానం కలగకపోతే బాగా మాట్లాడటానికి కృషి చెమ్యూలి. ఇతరులకు నచ్చేటట్లుగా మాట్లాడటం గ్రహించటం అవసరం. అభివృద్ధి అనేది ఏదీ దానంతట అది రాదు. నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. దీనివలనే అభివృద్ధి గాంచగల మనేది గుర్తుంచుకోవాలి. నీకు ఏది ఇష్టమో దేనిని గురించి బాగా మాట్లాడగలవో ఆ విషయాన్ని గురించి మాట్లాడటం మంచిది.

సంభాషణంటే కథమాదిరిగా ఒకరు చెప్పటం; ఒకరు వినటంకాదు. ఉభయులు కలసి మాట్లాడుకోవటం, సంప్రదించుకోవటం. ఆ పద్దతి ఉభయులకు ఉపయోగకారి. సంభాషణ అంటే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం కాదు. అవతలమనిషి మాట్లాడే దానిమీద నీ అభిప్రాయంచెప్పటం. ఒకరు మాట్లాడుతూఉంటే మరి ఒకరు “అచ్చా, బాగుంది అదే నేను ఆలోచించేది” అని అనరాదు. సంభాషణ అంటే చదరంగం వంటిది. ఇద్దరూ పాల్గొని ఆడాలి. ఒకరు

52