పుట:మాటా మన్నన.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహావలోకనం :

సంభాషణ ఎట్లా చెయ్యాలో కొంతవరకు మనం తెలుసుకున్నాం . సంభాషణ ఒక కళ అని, దానిని నేర్చుకోవచ్చునని గ్రహించటం అవసరం. కనుక బాగా మాట్లాడలేనివారు తగు కృషి చేయవలసి వస్తుంది. సహజంగా వచో నైపుణ్యంగలవారికి చెప్పనవసరం లేదు. అట్టి శక్తియుక్తులు లేనివారు మాత్రం తప్పక ప్రయత్నించవలసి వస్తుంది.

బాగాను, మనోహరంగానూ మాట్లాడాలంటే అనేక విషయా లున్నాయి. పెక్కు విషయాల్లో పరిజ్ఞానం కల వారికి మాట్లాడుటకు విషయం దొరకకపోదు. 'నాకు మాట్లాడటానికి విషయమేదీ కనపడటం లేదు' అనేవారి సంగతి గుర్తుంచుకోవాలి. ' నేనేమి మాట్లాడగలను' అంటారు కొందరు. అట్లా అంటంలో తన కిష్టమైన సంగతి ఏమీ లేదు అన్నమాట. మాట్లాడటం కష్టమనుకుంటే తగు కృషి చెయ్యాలి. వారి వారి అభిరుచులు అర్హతలనుబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృషిచేస్తారు. నే నెందుకూ పనికిరాని వాడిని అని గానీ, ఇతరుల దృష్టిలో మెలగజాలని వాడిని అని గాని తరచు అంటూ ఉండటం వింటాం. అది అతి వినయం, లేక నిరాశావాదం. నీకు ఇష్టం లేనిది ఇతరులకు ఇష్టం కావచ్చు.

బస్సు కండక్టరుకు, దుకాణంలో పనిచేసే మనిషికి ఆ పనుల్లో ఇష్టం లేకపోవచ్చు. కానీ వీరికి ప్రజల మనస్తత్వం బాగా తెలుసు. బహు జనం నిత్యం వీరితో సంబంధం

50