పుట:మాటా మన్నన.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగిఉంటారు. గృహకృత్యాలలో నిమగ్నులైన స్త్రీలు బజారుకువచ్చి ఏమి బావుకుంటారని అనుకుంటారు. కాని వారికి కూడా అనేక అనుభవాలు ఉంటాయి. దుకాణాలకు పోయి వస్తువులను కొనటం, బజారులోని మనుషులను చూడటం మొదలగునవి వీటిని గురించి వారు మాట్లాడ వచ్చు.

అందరూ బాగా మాట్లాడలేరనే సంగతి నిజమే. కానీ తమకు అందుబాటులోని సంగతిని గురించి ఆలోచించి ఆకర్ష వంతంగా మాట్లాడటానికి కృషి చెయ్యాలి.

ఏ విషయాన్ని గురించి మాట్లాడాలో తెలియని వారు కొంత కృషిచెయ్యాలి. ఎట్లాగంటే పొర్తా పత్రికలను చూస్తాం. దానిలో కొన్ని ప్రధానమైన వ్యాసాలుంటవి. వాటిని గురించి కొన్ని భావాలు కలగటం సహజం. వాటి యందు ఇష్టము అయిష్టము గూడా ఉంటుంది. అప్పుడు వాటిని గురించి మాట్లాడటం చాలా సులభం. కాకపోతే తెలియని విషయాలను తెలుసుకోవటం జరుగుతుంది. కొన్ని పట్టణాలలో మ్యూజియములు, పార్కులు ఉంటవి. అక్కడికి చాలామంది వెళ్ళుతారు. అట్లా వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే వారు కాలాన్ని ఎలా వృధా చేస్తున్నారో దానిని గురించి మాట్లాడవచ్చు. అది నచ్చేటట్లైతే వాటికి సంబంధించిన పుస్తకాలు చదివి యింకా అనేక సంగతులు నేర్చుకోవచ్చు. ప్రపంచంలో సుఖశాంతులు చాలామంది గోల్పోవటానికి కారణం 'దానిలో ఏముంది లే' అని అనుకో వడమే.

51